విషాదం: చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి

By సుభాష్  Published on  15 Feb 2020 7:38 AM GMT
విషాదం: చిరంజీవి తొలి సినిమా దర్శకుడు మృతి

టాలీవుడ్‌లో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు రాజ్‌కుమార్‌ మృతి చెందాడు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం కన్నుమూశారు. ఆయన మృతదేహాన్ని స్వగ్రామమైన విజయవాడ సమీపంలోని ఉయ్యూరుకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.

మెగాస్టార్‌ తొలి చిత్రానికి దర్శకుడు

కాగా, మెగాస్టార్‌ చిరంజీవి తొలి చిత్రమైన 'పునాది రాళ్లు' కు రాజ్‌కుమార్‌ దర్శకత్వం వహించారు. అయితే కొన్ని కారణాల వల్ల ఈ సినిమా విడుదల అప్పట్లో ఆలస్యమైంది. ఆ సినిమాకు ఆయన నంది అవార్డ్‌ కూడా దక్కించుకున్నారు. ఆ తర్వాత 'శ్రీమల్లి' అనే సినిమాను తీసిన రాజ్‌కుమార్‌.. అప్పటి నుంచి టాలీవుడ్‌కు దూరమయ్యారు. ఇటీవల రాజ్‌కుమార్‌కు అరోగ్యం బాగా లేదని తెలిసిన చిరంజీవి.. ఆయనను ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేయించారు.

రాజ్‌కుమార్‌కు భార్య, ఇద్దరు కుమార్తెలుండగా, భార్య, పెద్ద కుమారుడు అనారోగ్యంతో మరణించారు. అప్పటి నుంచి ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఆర్థిక స్థోమతతో ఇబ్బందులు పడుతున్న రాజ్‌కుమార్‌ అద్దె ఇంట్లో ఉంటూ జీవనం కొనసాగించారు.

Next Story