ధోని బేబీ..అలా అనకు

By Newsmeter.Network  Published on  1 Feb 2020 8:16 AM GMT
ధోని బేబీ..అలా అనకు

టీమిండియా మాజీ కెప్టెన్‌ మహేంద్ర సింగ్‌ ధోని.. వరల్డ్ కప్‌ తరువాత నుంచి క్రికెట్‌ కు దూరంగా ఉంటున్నాడు. ఆటకు దూరంగా ఉన్న ఈ కూల్ కెప్టెన్‌ సోషల్ మీడియాలో అభిమానులతో టచ్‌లోనే ఉంటున్నాడు. ఇక ధోని భార్య సాక్షి అయితే నిత్యం తన భర్త మహేంద్ర సింగ్‌ ధోనికి సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో ఎప్పటికప్పడు పోస్టు చేస్తూనే ఉంటుంది. దీంతో ధోని అభిమానుల మనసును సాక్షి గెలుచుకుంటారు అని చెప్పడంలో సందేహాం లేదు.

ఇక తాజాగా ధోని అభిమానులు ట్విట్టర్‌ లో పోస్ట్ చేసిన ఓ వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ధోని మాట్లాడుతూ.. 'నీ ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలను అభిమానించే ఫాలోవర్స్‌ జాబితాలో నన్ను కూడా చేర్చావుగా' అంటూ ట్రోల్‌ చేశాడు. దీంతో అక్కడ ఉన్న వారందరూ నవ్వారు. దీంతో భర్త దగ్గరకు వచ్చిన సాక్షి 'బేబీ నాకు ఫాలోవర్స్‌ ఎంతమంది ఉన్నా.. నేను ఎప్పటికి నీదాన్నే' అంది. కాగా ప్రస్తుతం వీరిద్దరూ.. సరదాగా మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

బీసీసీఐ.. ఆటగాళ్ల కాంట్రాక్టు ఆటగాళ్ల జాబితా నుంచి ధోని పేరును తొలగించింది. దీంతో మహేంద్రుడి అభిమానుల్లో కలవరం మొదలైంది. కాగా ఇప్పటి వరకు ధోని తన రిటైర్‌మెంట్ పై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఐపీఎల్‌ 2020 సీజన్‌ లో చైన్నై సూపర్‌ కింగ్స్‌ తరుపున బరిలోకి దిగనున్నాడు మహేంద్రుడు. ఐపీఎల్ తరువాతే ధోని రిటైర్‌మెంట్‌ పై స్పష్టత రానుంది.Next Story