భక్తులు తగ్గారు కాని..ఆదాయం పెరిగింది..!

By Newsmeter.Network  Published on  9 Oct 2019 1:56 PM GMT
భక్తులు తగ్గారు కాని..ఆదాయం పెరిగింది..!

విజయవాడ: గత ఏడాది దసరాతో పోల్చితే ఈ దసరాకు స్వల్పంగా దుర్గమ్మ దేవస్థాన ఆదాయం పెరిగింది.

గత ఏడాది రూ. 4 కోట్ల 53 లక్షల ఆదాయం వస్తే .. ఈ ఏడాది రూ.4 కోట్ల 56 లక్షల ఆదాయం వచ్చింది. గత ఏడాది దసరాతో పోల్చితే ఈ దసరాకు 70 వేలు భక్తులు తగ్గినట్లు తెలుస్తోంది. అమ్మవారి దర్శనం చేసుకున్న భక్తులు సంఖ్య గత ఏడాది 18 లక్షల 40 వేలు ఉండగా.. ఈ ఏడాది 17 లక్షల 70 వేలు. ప్రసాదాల కోసం ఈ ఏడాది క్యారీబ్యాగ్ లు అమ్మకాలు చేపట్టడంతో 2 లక్షల 9వేల ఆదాయాన్ని దేవస్దానం ఆర్జించింది. భక్తుల సంఖ్య తగ్గినప్పటికీ.. రూ.300, రూ.100లు టికెట్ల కొనుగోలు సంఖ్య పెరిగింది. లడ్డూ ప్రసాదాల కొనుగోలు తగ్గింది. అన్నదానానికి , కేశఖండనకు భక్తులు ఆసక్తి కనబర్చారు. అమ్మవారిని దర్శించుకునే వృద్ధులు, వికలాంగుల సంఖ్య తగ్గింది.

Next Story
Share it