ప్రముఖ బాలీవుడ్ సెలబ్రిటీ హాట్ ఫొటో గ్రాఫర్ డబూ రత్నానీ తాజాగా విడుదల చేసిన 2020 హాట్ క్యాలెండర్ ను చూసిన వారికి సెగలు పుట్టిస్తోంది. డబూ రత్నానీ 20 ఏళ్లుగా ఏటా తాను తీసిన ఫొటోల్లో ది బెస్ట్ ఫొటోలను సెలెక్ట్ చేసి ఒక క్యాలెండర్ ను విడుదల చేస్తారు. ఈ క్యాలెండర్ ఏ ఏడాదికి ఆ ఏడాది ప్రత్యేకంగానే ఉంటుంది. హీరోయిన్ల అందాలను వివిధ భంగిమల్లో చూపిండం డబూ రత్నానీ ప్రత్యేకత. 2020 క్యాలెండర్ లో కియారా అద్వానీ, భూమి పెడ్నెకర్ టాప్ ప్లేస్ లో నిలిచారు.

ఈ ఫొటోలను సెలబ్రిటీలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో #dabbooratnanicalendar హ్యాష్ టాగ్ తో షేర్ చేసి తమ సంతోషాన్ని పంచుకున్నారు. మంగళవారం సాయంత్రం ముంబైలో వేడుకగా జరిగిన క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి రేఖా ముఖ్య అతిథిగా హాజరై..క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ప్రస్తుతం కియారా అద్వానీ ఫొటోను నెటిజన్లు వైరల్ చేస్తున్నారు. కాస్త బోల్డ్ లుక్ లో ఉన్న ఈ ఫొటోని కియారా తన ఇన్ స్టా ఖాతాలో షేర్ చేయగా..నెటిజన్లు రకరకాలుగా కామెంట్ చేస్తున్నారు. ఒకరు కాస్త డ్రస్ వేసుకో అంటే..మరొకరు చాలా అందంగా ఉన్నావని, ఇంకొకరు మీరు అందరికన్నా హాట్ గా కనిపిస్తున్నారంటూ కామెంట్లు పెట్టారు.

ఈ క్యాలెండర్ లో విద్యా బాలన్, అనన్య పాండే, సన్నీ లియోన్, పరిణీతి చోప్రా, జూనియర్ బచ్చన్, జాన్ అబ్రహం, ఆర్యన్ కార్తీక్, అనుష్క శర్మ, అస్లీ జాకీలిన్  సైఫ్ అలీఖాన్, కార్తీక్ ఆర్యన్, హృతిక్ రోషన్, విక్కీ కౌశల్ లు కూడా చోటు దక్కించుకున్నారు. క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమానికి హాజరైన వీరందరికీ..తమ చిత్రాలను ఫ్రేమ్ కట్టి బహుకరించారు డబూ రత్నానీ.

https://twitter.com/DabbooRatnani/status/1229873454121308161/photo/1

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.