అక్రమంగా కరెంట్ క్రాకర్స్ విక్రయం..ముగ్గురు అరెస్ట్
By రాణి Published on 31 Dec 2019 8:11 PM IST
వివిధ ఫంక్షన్లలో వాడే కరెంట్ క్రాకర్స్ ను అక్రమంగా విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను సుల్తాన్ బజార్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఆన్ లైన్ ద్వారా కూల్ కాయిన్స్, ఐరన్ పైప్ గన్స్ ను విక్రయిస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. కోఠి గుజరాతీ గల్లీ వేదికగా వ్యాపారం చేస్తున్న వీరివద్ద నుంచి పలు ఐరన్ పైప్ గన్స్ తో పాటు, కరెంట్ క్రాకర్స్ ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ఈ తరహా క్రాకర్స్ ను యువత, వ్యాపారులు విక్రయించరాదని, వీటిని నాలుగు గోడల మధ్య, స్టేజిలపై కాకుండా బహిరంగ ప్రదేశాల్లో మాత్రమే కాల్చాలని హెచ్చరించారు.
న్యూ ఇయర్ వేడుకల్లో ఇలాంటి క్రాకర్స్ ను అక్రమంగా అమ్మేవారు చాలా మంది ఉంటారు. ఇలాంటి క్రాకర్స్ కొనేటపుడు అవి డమ్మీవా లేక ఒరిజినల్ వా చూసి కొనాలని హెచ్చరిస్తున్నారు పోలీసులు. దేశం పై న్యూ ఇయర్ సందర్భంగా ఉగ్రదాడి చేస్తామని హెచ్చరికలు వచ్చిన నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకలకు క్రాకర్స్ కొనే విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.