వరదలను దాటుకుని ఒక్కటైన జంట.. ఫోటోలు వైరల్‌

By సుభాష్  Published on  28 Oct 2020 11:55 AM GMT
వరదలను దాటుకుని ఒక్కటైన జంట.. ఫోటోలు వైరల్‌

కల్యానమొచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు వానొచ్చినా.. వరదొచ్చినా.. తమ వివాహం జరిగి తీరాల్సిందేనంటూ ఓ జంట నిశ్చయించుకుంది. భారీ వరదలను దాటుకుని మరీ పెళ్లి తంతు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పెళ్లి దుస్తుల్లో వధూవరుల ఇబ్బందులకు సంబంధించిన ఫోటోలు సోషల్‌ మీడియాలో తెర వైరల్‌ అవుతున్నాయి. ఎన్ని వరదలు వచ్చినా తమ పెళ్లి మాత్రం ఆగదన్నట్లు వరదల అడ్డంకులను తట్టుకుని ఆ జంట ఒక్కటైంది. వీరిని చూసి నెటిజన్లు సైతం అభినందిస్తున్నారు.

Couple Braves Storm 1

ఫిలిప్పిన్స్‌ స్టార్‌ వార్త పత్రిక కథనం ప్రకారం.. ఆ దేశంలో అనేక ప్రాంతాల్లో భారీ వరదలు ముంచెత్తాయి. అయితే ఇలాంటి ప్రతికూల వాతావరణంలో కూడా వివాహ బంధంతో ఒక్కటవ్వాలనుకున్న రోనీ గుళీపా, జెజిల్‌ మసూలా అనే జంటకు ఎన్ని వరదలు వచ్చినా.. అడ్డంకులేమి రాలేదు. భారీ వర్షాల కారణంగా వరదలతో పోటెత్తిన లుయాంగ్‌ నదిని దాటుకుని చర్చికి వెళ్లి అక్టోబర్‌ 23న మూడు ముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. ఈ సందర్భంగా గౌనులో వధువు, సూట్‌లో వరుడు ఇద్దరూ పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. ఈ జంటతో పాటు స్నేహితులు, బంధువులు కూడా ఇబ్బందులు పడుతూ వివాహానికి హాజరు కావడం గమనార్హం. ఈ పెళ్లి వేడుక అనంతరం అందరు ఆనందంతో ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ పెళ్లి ప్రయాణానికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. దీనికి సంబంధించిన ఫోటోలు బంధువుల్లో ఒకరు సోషల్‌ మీడియాలో షేర్ చేశారు.

Couple Braves Storm 11

Next Story