ఇరాన్‌ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

By సుభాష్  Published on  28 Feb 2020 7:23 AM GMT
ఇరాన్‌ ఉపాధ్యక్షురాలికి కరోనా వైరస్‌

కొవిడ్‌ -19 (కరోనా వైరస్‌) ప్రపంచాన్ని వణికిస్తోంది. చైనాతోపాటు దాదాపు 48 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ కారణంగా చైనాలో ఇప్పటి వరకు దాదాపు 2800 వరకు మృతి చెందగా, 78వేల మంది వరకు చికిత్స పొందుతున్నారు. కాగా, ఇరాన్‌ ఆరోగ్యశాఖ ఉప మంత్రి హరిర్చి సైతం కరోనా సోకగా, తాజాగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు మసౌమే ఎబ్తేకర్‌కు సోకడంతో ఆ దేశ వాసులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని ఎబ్తేకర్‌ సలహాదారు ఫరీబా మీడియాకు తెలిపారు. ఆమెక కరోనా వైరస్‌ సోకినట్లు నిర్ధారణ కావడంతో ఆమె బృందంలో ఉన్న మరి కొంత మంది భయాందోళన చెందుతున్నారు. వీరందరి రక్త నమూనాలను సేకరించి వైద్యశాలకు పంపించారు. ఈ రిపోర్టు శనివారం వరకు వచ్చే అవకాశం ఉంది.

26 మంది మృతి

ఇరాన్‌లో ఇప్పటి వరకు కరోనా బారిన 240 మంది ఉండగా, 26 మంది మృతి చెందారు. ఫిబ్రవరి 19న ఒక్క రోజే 106 కరోనా వైరస్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story