కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. ఈ వైరస్‌ కారణంగా వేలాదిగా మృత్యువాత పడగా, వేలాది మంది చికిత్స పొందుతున్నారు. చైనాలో పుట్టిన ఈ వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. ఈ వైరస్‌ మనుషులకే కాదు జంతువులకు కూడా వ్యాపిస్తోంది. హాంకాంగ్‌లో ఓ పెంపుడు కుక్కకు కరోనా సోకింది. ఈ విషయాన్ని హాంకాంగ్‌ అగ్రికల్చరల్‌ అండ్‌ ఫిషరీస్‌ అండ్‌ కన్జర్వేషన్‌ డిపార్ట్‌ మెంట్‌ బుధవారం ధృవీకరించారు. కరోనా సోకిన మహిళ నుంచి కుక్కకు సోకినట్లు వైద్యులు చెప్పారు. కాగా, ప్రపంచంలో ఒక కుక్కకు కరోనా వైరస్‌ పాజిటివ్‌ అని తేలడం ఇదే మొదటిసారని చెబుతున్నారు. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్‌ వల్ల 3200 మంది మృతి చెందగా, 90వేల మందికిపైగా కరోనా తో చికిత్స పొందుతున్నారు.

కాగా, శుక్రవారం హాంకాంగ్‌ ప్రభుత్వం పెంపుడు జంతువుల కోసం ప్రత్యేక క్వారంటైన్‌ను ఏర్పాటు చేసింది. వైరస్‌ బారిన పడిన జంతువులకు అక్కడ ఉంచి చికిత్సలు అందిస్తున్నారు. అలాగే మరో రెండు కుక్కలకు కరోనా సోకిందనే అనుమానంతో ముందు జాగ్రత్తగా ఐసోలేషన్‌ వార్డులో ఉంచారు. ఈ రెండు కుక్కల్లో ఒకదానికి నెగిటివ్‌ అని తేలింది. మరో కుక్క వివరాలు రావాల్సి ఉంది.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.