'' దేశమంతా లాక్ డౌన్..కరోనా బ్రేక్ డౌన్ ''

By రాణి  Published on  31 March 2020 12:28 PM GMT
 దేశమంతా లాక్ డౌన్..కరోనా బ్రేక్ డౌన్

కరోనా మహమ్మారి 200 దేశాల ప్రజలను గడగడలాడిస్తోంది. భారత్ లో కూడా మంగళవారం సాయంత్రానికి 1251 కేసులు నమోదవ్వగా 32 మంది మృతి చెందారు. తెలంగాణలో ఆరుగురు మృతి చెందారు. దేశవ్యాప్తంగా 102 మంది కోలుకుని ఇళ్లకు చేరారు. కాగా..కరోనా వ్యాప్తిని దేశమంతా లాక్ డౌన్ అయింది. కరోనాను జయించాలంటే సామాజిక దూరం తప్పనిసరి అని అందరూ గ్రహించారు. కరోనా నియంత్రణపై ఇప్పటికే రెండు పాటలు విడుదలయ్యాయి. ఒకటి..''చేతులెత్తి మొక్కుతా..చేయిచేయి కలపకురా, కాళ్లు కూడా మొక్కుతా అడుగు బయట పెట్టకురా'', రెండోది సంగీత దర్శకుడు కోటి సారథ్యంలో టాలీవుడ్ అగ్ర హీరోలు పాడిన పాట. మహేష్ బాబు సినిమాలోని మైండ్ బ్లాక్ సాంగ్ ను కూడా కరోనా పేరడి సాంగ్ గా మార్చేశారు. ఈ మూడు పాటలు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యాయి.

తాజాగా..ప్రముఖ గాయకుడు వందేమాతరం శ్రీనివాస్ కూడా కరోనా పై పాటపాడి విడుదల చేశారు. '' కరోనా..కరోనా నీతో యుద్ధం చేస్తాం మా భారత భూ భాగాన, కరోనా..కరోనా నిన్ను మట్టి కరిపిస్తాం..130 కోట్ల జనం సరేనా, మా ఇంట్లో మేముంటాం..నీ కంట్లో కంపగొడతాం. మేము కాళ్లు బయటపెట్టం..నీ కాళ్లను నరికేస్తాం..'' అంటూ వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాట కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలిపేలా ఉంది. మీరూ ఓ సారి వినేయండి.

Next Story