సచివాలయాన్ని తాకిన కరోనా..

By రాణి  Published on  31 March 2020 2:27 PM GMT
సచివాలయాన్ని తాకిన కరోనా..

తెలంగాణ సచివాలయాన్ని సైతం కరోనా వదిలిపెట్టలేదు. రాష్ట్రంలో లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు సైతం వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. తప్పనిసరిగా ఆఫీసులకు రావాల్సిన వారిని మాత్రమే విధులకు అనుమతిస్తున్నారు. అలా సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగికి మంగళవారం సాయంత్రం కరోనా సోకినట్లు నిర్థారణైంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. సచివాలయంలోని పశుసంవర్థక శాఖలో పనిచేస్తున్న సెక్షన్ ఆఫీసర్ ఇటీవలే ఢిల్లీ వెళ్లొచ్చినట్లు గుర్తించారు.

Also Read : మరో ఇటలీ, అమెరికాగా భారత్..

తెలుగు రాష్ట్రాల్లో ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో జరిగిన మత ప్రార్థనలు వెళ్లొచ్చిన వారిలో భారీ సంఖ్యలో కరోనా కేసులు వెలుగులోకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ ఉద్యోగి కూడా ఢిల్లీ వెళ్లొచ్చాడని గుర్తించి కరోనా పరీక్షలు నిర్థారించారు. మంగళవారం సాయంత్రం అతనికి పాజిటివ్ అని తేలడంతో ఆ ఉద్యోగిని వెంటనే గాంధీకి తరలించి ఐసోలేషన్ వార్డులో చికిత్స అందజేస్తున్నారు. ఉద్యోగికి కరోనా సోకిందని తేలడంతో ట్యాంక్ బండ్ సమీపంలోని బీఆర్కే భవనాన్నంతటినీ శానిటైజ్ చేస్తున్నారు. అలాగే ఆ వ్యక్తితో కాంటాక్ట్ చేసిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు అధికారులు. బాధిత వ్యక్తి కుటుంబ సభ్యులకు కూడా కరోనా పరీక్షలు చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు.

Also Read : లైవ్‌లో ఏడ్చిన యాంకర్‌ రష్మీ గౌతమ్‌

Next Story