యూరప్, పశ్చిమాసియాలకు వ్యాపించిన కరోనా

By రాణి  Published on  25 Feb 2020 11:41 AM GMT
యూరప్, పశ్చిమాసియాలకు వ్యాపించిన కరోనా

ఇప్పటి దాకా చైనాను మాత్రమే గడగడలాడించిన కరోనా ఇప్పుడు తన పంజాను పెద్దది చేసింది. చైనాకు ఇరుగుపొరుగున ఉన్న దేశాలతో పాటు, పశ్చిమాసియా, యూరోప్ లలోనూ విస్తరిస్తోంది. చైనాలో ఇప్పుడిప్పుడే కొద్ది కొద్దిగా అదుపులోకి వస్తున్నా మిగతా దేశాల్లోకి వ్యాపిస్తోంది.

ఇరాన్ లో ఇప్పటికే పన్నెండు ప్రాణాలను కరోనా కబళించింది. ఇరాన్ లోని కోమ్ నగరంలో యాభైకి పైగా కేసులు నమోదయ్యాయని స్థానిక వార్తా సంస్థలు తెలిపాయి. వీరందరూ చనిపోయారని కూడా ఒక స్థానిక నాయకుడు ప్రకటించాడు. అయితే ఇరాన్ ప్రభుత్వపు ఆరోగ్య శాఖ దీనిని ధ్రువీకరించలేదు. మరోవైపు దగ్గర్లో ఉన్న ఇరాక్, కువైట్, బహ్రేన్, ఓమాన్, ఆఫ్గనిస్తాన్లలోనూ తొలి కరోనా కేసులు నమోదయ్యాయి. అన్ని దేశాలకూ ఇరాన్ తో లింక్ ఉండటం గమనార్హం. ఇప్పటికే కరోనా కాటుకు ప్రపంచ స్టాక్ మార్కెట్లు కుప్పఉవీకరించలేదు. కూలుతున్నాయి, ఆర్ధిక వ్యవస్థలకు చలి జ్వరం వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక పరిస్థితి మందగించింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడ్డవారి సంఖ్య 79000 కి పెరిగింది.

ఇక యూరప్ లో ఇటలీ పది నగరాల్లోని యాభై వేల మంది ప్రజలను ఇళ్లలో నుంచి బయటకి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. ఆ దేశంలో ఇప్పటికి మూడు మరణాలు నమోదయ్యాయి. ఇటలీలో ఇప్పటికి 219 కేసులు నమోదయ్యాయి. ఇటు అమెరికాలో 53 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇంకో వైపు కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో ప్రపంచంలోని వివిధ స్థానాల్లో చైనా వ్యతిరేకత పెచ్చరిల్లుతోంది. బర్మింగ్ హామ్ లో మీరా సోలంకా అనే భారతీయ మూలానికి చెందిన మహిళ తన పుట్టిన రోజు జరుపుకుంటోంది. అందులో కొందరు చైనా యువకులు కూడా పాల్గొన్నారు. ఒక మూక చైనా వాళ్లని మీ వైరస్ మీరు తీసుకుని మీ దేశానికి పొండి అని తిట్టడం మొదలుపెట్టారు. చైనా యువకులకు మద్దతుగా వెళ్లిన మీరాను ముఖంపై బలంగా కొట్టారు. ఆమెను తరువాత ఆస్పత్రిలో చేర్చారు.

Next Story