కరోనా వ్యాధి సుడిగాలిలా వ్యాపించేస్తోంది. ప్రపంచ దేశాలన్నిటినీ చాప చుట్టేస్తోంది. ఇప్పటికే లక్షమంది కేసులు, మూడు వేలకు పైగా మరణాలు నమోదయ్యాయి. ప్రపంచమంతా తుమ్మినా, దగ్గినా భయపడిపోతోంది. ఎవరైనా ముక్కు చీదితే చాలు వణికిపోతోంది. టూరిజం దెబ్బతిన్నది. స్కూళ్లు, ఆఫీసులు దెబ్బతిన్నాయి. ఆఖరికి సినీ పరిశ్రమ – ముఖ్యంగా చైనా సినీ పరిశ్రమ, హాలీవుడ్ – కూడా చావు దెబ్బ తిన్నాయి.

కరోనా మొదటి దాడి చేసింది చైనాపైనే. చైనా ప్రపంచంలోని రెండో అతి పెద్ద సినిమా మార్కెట్లు. గతేడాది జనవరి ఫిబ్రవరి నెలల్లో సంపాదించిన ఆదాయంతో పోలిస్తే చైనా సినిమా రంగానికి ఈ ఏడాది రెండు బిలియన్ల డాలర్ల  మేరకు తక్కువ ఆదాయం వచ్చింది. గత ఏడాది చైనాలో సినిమా పరిశ్రమ 9.2 బిలియన్ల డాలర్లు సంపాదించింది. మిగతా ప్రపంచ సినిమా కన్నా 20 శాతం కన్నా ఎక్కువ ఆదాయాన్ని సాధించింది. ప్రతి ఏడాదీ జనవరి – ఫిబ్రవరి చైనాలో సెలవు దినాలు ఉంటాయి. ఈ సెలవు దినాల్లోనే సినిమాలకు బోలెడంత ఆదాయం వస్తుంది. కానీ ఈ సారి కరోనా వల్ల సినిమా హాళ్లు ఖాళీగా ఉంటున్నాయి. ఈ రెండు నెలల్లో 3.9 మిలియన్ల మేరకు వసూళ్లు మాత్రమే సాధించింది. అదే గతేడాది సెలవు దినాల్లో 1.76 బిలియన్లు వసూలు చేసింది.

ఒక్క చైనా మాత్రమే. కాదు. మొత్తం ప్రపంచ సినీ పరిశ్రమ కరోనా పుణ్యమా అని మొత్తం హాలీవుడ్ వ్యాపారమే కుదైలేంది. కరోనా వల్ల ప్రధానంగా ప్రపంచంలోని రెండో అతి పెద్ద మార్కెట్ చైనా , మూడో మార్కెట్ జపాన్, అయిదో పెద్ద మార్కెట్ దక్షిణ కొరియాలు చాలా ప్రభావితం అయ్యాయి. దీనితో ఈ దేశాల్లో సినిమా హాళ్లు చిన్నబోయాయి.కొరియాలో సినిమా హాళ్లలో ప్రేక్షకుల సంఖ్లో 70 శాతం తగ్గుదల వచ్చింది. కొరియాలో గతేడాది ఇదే సమయంలో 158 మిలియన్ల డాలర్లు వసూలు కాగా, ఈ సారి కేవలం 52 మిలియన్ డాలర్లు వసూలయ్యాయి. జపాన్ లోనూ బాక్సాఫీస్ కనీసం పదిహేను శాతం తగ్గుదలను కనబరుస్తోంది.

జేమ్స్ బాండ్ తాజా చిత్రం నో టైమ్ టు డై కూడా వాయిదా పడింది. ఇప్పడీ సినిమా నవంబర్ లోనే విడుదల అయ్యే అవకాశం ఉంది. 200 మిలియన్ల డాలర్ల వ్యయంతో నిర్మించిన ములన్ చిత్రం పరిస్థితి కూడా ఇంతే.  హాలీవుడ్ చిత్రం బర్డ్స్ ఆఫ్ ప్రే కరోనా సునామా హోరులో విడుదలైంది. అందుకే కలెక్షన్లు కరువైపోయాయి.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.