తెలంగాణలో కొత్తగా 1486 పాజిటివ్‌ కేసులు

By సుభాష్  Published on  20 Oct 2020 2:46 AM GMT
తెలంగాణలో కొత్తగా 1486 పాజిటివ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల కిందట దాదాపు 2వేలకుపైగా కేసులు నమోదవుతుండగా, ఇప్పుడు తగ్గుముఖం పడుతూ వస్తున్నాయి. తాజాగా గడిచిన 24 గంటల్లో 1,486 పాజిటివ్‌ కేసులు నమోదు కాగా, ఏడుగురు మృతి చెందారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,24,545కు చేరగా, మృతుల సంఖ్య 1282కు చేరింది.

ఇక నిన్న ఒక్క రోజే 1891 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటి కోలుకున్నవారి సంఖ్య 2,02,577 ఉంది. ప్రస్తుతం 20,686 మంది చికిత్స పొందుతున్నారు. హోం ఐసోలేషన్‌లో 17,208 మంది ఉన్నారు. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా హైదరాబాద్‌లో 235 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది.

Next Story