నేను క్షేమం.. టెన్షన్‌ వద్దు: సునీల్‌

By సుభాష్  Published on  23 Jan 2020 10:08 AM GMT
నేను క్షేమం.. టెన్షన్‌ వద్దు: సునీల్‌

టాలీవుడ్‌ ప్రముఖ కమెడీయన్‌, నటుడు సునీల్‌కు అస్వస్థతకు గురవడంతో చికిత్స నిమిత్తం గచ్చిబౌలిలోని ఏషియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్టో ఎంట్రాజీ ఆస్పత్రిలో చేరారు. సునీల్‌ ఆనారోగ్యానికి గురవడంతో అభిమానులు ఆందోళన చెందారు. సునీల్‌కు ఏమైందోనని టెన్షన్‌ పడ్డారు. సునీల్‌ ఆరోగ్య త్వరగా మెరుగుపడాలని కోరారు. ఇక అభిమానుల ఆందోళన, వస్తున్న వార్తలపై సునీల్‌ స్పందించారు. తాను ప్రస్తుతం ఆరోగ్యంగానే ఉన్నానని పేర్కొన్నారు. సైనస్‌, ఇన్‌ఫెక్షన్‌ కారణంగా వైద్యుల సూచనతో ఆస్పత్రిలో చేరానని చెప్పారు.

కాగా, సునీల్‌ తాజాగా నటించిన రవితేజ మూవీ ‘డిస్కోరాజా’ రేపు విడుదల కానుంది. హస్యనటుడిగా తన ప్రయాణం సాగించిన సునీల్‌.. అందాల రాముడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. రాజమౌళి ‘మర్యాద రామన్న’తో సూపర్‌ హిట్‌ కొట్టాడు. హీరోగా పలు విజయవంతమైన సినిమాల్లో నటించిన సునీల్‌.. తర్వాత రేస్‌లో వెనుకబడ్డాడు. ప్రస్తుతం సునీల్‌ కమెడీయన్‌గా కొనసాగుతున్నారు. ఇదిలా ఉంటే ‘కలర్‌ ఫోటో’ అనే సినిమాలో సునీల్‌ విలన్‌ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.

Next Story
Share it