ప్రముఖ నటుడు పృథ్వీరాజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. సోమవారం ఈ ఘటన జరిగిందంటూ పృథ్వీరాజ్‌ బృందం ఆయన ఫేస్‌బుక్‌ ఖాతాలో వెల్లడించింది. బంజారాహిల్స్‌ క్యాన్సర్‌ ఆస్పత్రి వద్ద వినాయకుడి ఆలయం వైపు పృథ్వీరాజ్‌ వెళ్తుండగా ఓ కారు వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయన కారు ధ్వంసమైంది. చుట్టుపక్కల వారు వచ్చి ధ్వంసమైన కారు ఫోటోను షేర్‌ చేశారు. అయిన పృథ్వీ ఆరోగ్య పరిస్థితి గురించి ఎలాంటి సమాచారం లేదు.

కాగా, పృథ్వీరాజ్‌ గతంలో కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో ఓ క్వారంటైన్ సెంటర్‌లో చికిత్స తీసుకున్నట్లు చెప్పారు. తర్వాత కరోనా నెగిటివ్‌ వచ్చినట్లు వెల్లడించారు.

సుభాష్

.

Next Story