ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. ఫ‌స్టులుక్ వైర‌ల్‌

By సుభాష్  Published on  28 Oct 2020 9:16 AM GMT
ఇంటర్‌పోల్‌ ఆఫీసర్‌గా ఇర్ఫాన్ ప‌ఠాన్‌.. ఫ‌స్టులుక్ వైర‌ల్‌

అప‌రిచితుడు సినిమాతో తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ద‌క్కించుకున్న న‌టుడు చియాన్ విక్ర‌య్‌. ఆయ‌న సినిమాలు తెలుగులోనూ విడుద‌ల‌వుతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం ఆయ‌న న‌టిస్తున్న చిత్రం ‘కోబ్రా’. కేజీఎఫ్‌ ఫేమ్‌ శ్రీనిధి శెట్టి ఇందులో క‌థానాయిక‌‌గా నటిస్తోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీలో విక్రమ్‌ ఏడు పాత్రల్లో కనిపించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ చిత్రం ద్వారా టీమ్ఇండియా మాజీ ఆల్‌రౌండ‌ర్ ఇర్ఫాన్ ప‌ఠాన్ వెండితెర‌పై ఎంట్రీ ఇస్తున్నారు.

మంగళవారం పఠాన్ పుట్టినరోజు సందర్భంగా కోబ్రా నుంచి ఫస్ట్‌లుక్‌ని రిలీజ్ చేశారు. ఇందులో అస్లన్‌ ఇల్మజ్‌ ఏ ఫ్రెంచ్‌ ఇంటర్‌పోల్‌ ఆఫీసర్ పాత్రలో ఇర్ఫాన్ నటిస్తున్నాడు. ఇర్ఫాన్ ఫ‌స్టు లుక్ ఆక‌ట్టుకుంటోంది. ప్ర‌స్తుతం ఈ ఫ‌స్టులుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తుండ‌గా.. సర్‌జానో, కేఎస్‌ రవికుమార్‌ తదితరులు కీలక పాత్రల్లో నటించనున్నారు. ఈ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియోస్‌, వియకామ్‌ 18 సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

Next Story