సాఫ్ట్ వేర్ ఉద్యోగినితో ఆటో డ్రైవర్ అసభ్య ప్రవర్తన
By Newsmeter.Network
హైదరాబాద్ : మహిళల అఘాయిత్యాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిర్భయ లాంటి కఠిన చట్టాలు వచ్చిన కూడా మహిళల పై అఘాయిత్యాలు ఆగడం లేదు. కాలేజీలు, బస్ స్టాఫ్ ల వద్ద పోకిరీలు మహిళలను అసభ్య పదజాలతో దూషిస్తున్నారు. షీ టీమ్స్ ను ఏర్పాటు చేసిన పోకిరీల ఆగడాలకు అడ్డుకట్ట పడడం లేదు. మహిళలు ఒంటరిగా వెళ్లాలంటే భయపడే దుస్థితి దాపురించింది. తాజాగా ఉద్యోగానికి ఆటోలో బయలు దేరిన సాఫ్ట్ వేర్ ఉద్యోగిని పట్ల ఆటో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. సకాలంలో స్పందించిన స్థానికులు ఆటో డ్రైవర్ ను చితకబాది పోలీసులకు అప్పగించారు.
బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగిని కార్యాలయానికి వెళ్లడానికి ఓ ఆటో ఎక్కింది. కొంత దూరం వెళ్లాక ఆటో డ్రైవర్ నరసింహా ఉద్యోగిని చేయి పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. యువతి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు స్పందించి ఆటో డ్రైవర్ నుంచి యువతిని రక్షించారు. ఆటో డ్రైవర్ ను పట్టుకుని ఓ స్తంబానికి కట్టివేసి చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని ఆటో డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.