క్రిస్‌లిన్‌ బుర్రలోంచి పొగలు.. వీడియో వైరల్

By Newsmeter.Network  Published on  29 Feb 2020 12:21 PM GMT
క్రిస్‌లిన్‌ బుర్రలోంచి పొగలు.. వీడియో వైరల్

పాకిస్థాన్‌ సూపర్‌ లీగ్‌(పీఎస్‌ఎల్) ఫన్నీ ఇన్సిడెంట్స్‌కు కెరాఫ్‌ అడ్రస్‌గా మారిపోయింది. ఇటీవల పాకిస్థాన్‌ యువ హిట్టర్‌ జమాన్‌ ఖాన్‌ రనౌట్‌ నుంచి తప్పించుకునేందుకు బ్యాట్స్‌ను రివర్స్‌లో పట్టుకుని క్రీజులో ఉంచాడు. దీంతో అది చూసిన ప్రేక్షకులతో పాటు కామెంటేటర్లు పడి పడి నవ్వారు. ఇదిలా ఉంటే తాజాగా ఆస్ట్రేలియా హిట్టర్‌ క్రిస్‌లిన్.. బుర్రలోంచి ఏకంగా పొగలు వచ్చాయి.

శుక్రవారం రాత్రి రావల్పిండి వేదికగా లాహోర్ ఖలందర్స్, పెషావర్ జల్మీ జట్ల మధ్య మ్యాచ్‌కు వరుణుడు అంతరాయం కలిగించాడు. దీంతో మ్యాచ్‌ను 12 ఓవర్లకు కుదించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన పెషావర్ టీమ్.. టామ్ బాంటన్ (34: 15 బంతుల్లో 4x4, 2x6), హైదర్ అలీ (34: 12 బంతుల్లో 1x4, 4x6) విధ్వంసక ఇన్నింగ్స్ లు ఆడడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 132 పరుగులు చేసింది.

అనంతరం 133 పరుగుల లక్ష్యఛేదనలో తడబడిన లాహోర్ ఖలందర్స్ ఆఖరికి 116/6కే పరిమితమైంది. ఆ జట్టు ఓపెనర్‌ క్రిస్‌లిన్ (30: 15 బంతుల్లో 4x4, 1x6) దూకుడు ఆడే ప్రయత్నం చేశాడు. ఇన్నింగ్స్ తొలి ఓవర్ వేసిన రహత్ అలీ బౌలింగ్‌లో వరుసగా 6, 4 బాదేసిన క్రిస్‌లిన్.. ఆ తర్వాత రెండో ఓవర్ వేసిన హసన్ అలీ బౌలింగ్‌లోనూ వరుసగా 4, 2, 4, 4 బాదేశాడు. కానీ.. ఐదో ఓవర్‌లో భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో ఔటైన లిన్.. పెవిలియన్‌కి వెళ్తున్న సమయంతో హెల్మెట్‌ తీశాడు. అప్పుడు అతని బుర్రలో నుంచి పొగలు వెలుపలికి రావడం అందర్నీ ఆశ్చర్యపరిచింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై నెటీజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఆ ఫైర్‌ ఇంజిన్‌ పై నీళ్లు చల్లండి.. అని ఓ నెటీజన్‌ కామెంట్‌ చేయగా.. వామ్మో క్రిస్‌లిన్‌ టూ హాట్‌ అంటూ మరొనెటీజన్‌ కామెంట్‌ చేశాడు.



Next Story