చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

By సుభాష్  Published on  24 Jun 2020 8:21 AM GMT
చిత్తూరు జిల్లాలో ఘోర ప్రమాదం.. నలుగురు మృతి

ఏపీ- కర్ణాటక సరిహద్దుల్లో విషాదం నెలకొంది. బోరు వేసేందుకు వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన బుధవారం చిత్తూరు జిల్లా పెద్ద తిప్పసముద్రం మండలం కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో చోటు చేసుకుంది.

కర్ణాటకలోని చేలూరు మండలం పాల చెరువు వద్ద పొలంలో బోరు వేసేందుకు వెళ్తున్నబోరు లారీ ప్రమాదవశాత్తున బోల్తా పడింది. ఈ ప్రమాదంలో జయదేవ్‌, రాజారాం, సుబ్రమణ్యం, నవదేశ్‌లు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి గాయాలు కాగా, చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా మధ్యప్రదేశ్‌ రాష్ట్రానికి చెందిన వారుగా గుర్తించారు.

Next Story
Share it