'చిరు' వీణ స్టెప్పు వేయబోతున్న సల్మాన్ ఖాన్

By Newsmeter.Network  Published on  29 Nov 2019 6:57 AM GMT
చిరు వీణ స్టెప్పు వేయబోతున్న సల్మాన్ ఖాన్

బాలీవుడ్ సల్లూ భాయ్ సల్మాన్ ఖాన్ కి టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి అంటే ఎంతో అభిమానం. ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో గౌరవం కూడా ఉంది. ఇద్దరూ దాన్ని ఏ రోజూ దాచుకోలేదు. అంతెందుకు? చిరంజీవి ముద్దుల కొడుకు రామ్ చరణ్ తేజ్ జంజీర్ రీ మేక్ షూటింగ్ కోసమని ముంబాయిలో ఉన్నప్పుడు ప్రతి రోజూ సల్మాన్ ఇంటి భోజనం సెట్స్ కి వచ్చేది. అంత దోస్తీ ఇద్దరు సూపర్ స్టార్లది.

ఇప్పుడు చిరంజీవి పట్ల తన అభిమానాన్ని చూపించుకునేందుకు సల్మాన్ కి ఒక అద్భుతమైన అవకాశం వచ్చింది. ప్రస్తుతం ఆయన దబంగ్ 3 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ప్రముఖ కోరియో గ్రాఫర్, సినీ డైరెక్టర్ ప్రభుదేవా దీనికి డైరెక్టర్. ఈ సినిమాలో మున్నా బద్నామ్ హువా అనే ఐటమ్ సాంగ్ లో చిరంజీవి ట్రేడ్ మార్క్ వీణ స్టెప్ ను పెట్టవలసిందిగా సల్మాన్ ప్రభుదేవాను కోరాడు. “దాయి దాయి దామ్మా” పాటలో చిరు వేసిన వీణ స్టెప్పు అదిరిపోవడమే కాదు, ఆది చిరు అనగానే గుర్తొచ్చే స్టెప్పుగా మారిపోయింది. దీన్ని ఎంతో మంది ఇమిటేట్ చేశారు కూడా. కానీ ఇప్పుడు ఈ స్టెప్పును వేయడం ద్వారా సల్మాన్ చిరు పట్ల తన అభిమానాన్ని చాటుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు.

దబంగ్ 3 డిసెంబర్ నెల నుంచి ప్రారంభమౌతుంది. ఇందులో గతంలో దబంగ్ లో మలైకా చేసిన ఐటమ్ సాంగ్ “మున్నీ బద్నామ్ హుయీ” పాటకు లింగ మార్పిడి చేసి మున్నా బద్నాం హువా అని కొత్త ఐటమ్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఇందులో ఐటమ్ బాయ్ గా సల్మానే స్టెప్పులేయబోతున్నాడు.

Next Story
Share it