విజయవాడ: మహానటుడు, తెలుగు పరిశ్రమకే వన్నె తెచ్చిన ఎస్వీ రంగారావు విగ్రహాన్ని చిరంజీవి ఆవిష్కరించారు. కాసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయం చేరుకున్న చిరంజీవిని.. అభిమానులు భారీ ర్యాలీతో తాడేపల్లి తీసుకెళ్లారు. మధ్యలో హనుమాన్ జంక్షన్ దగ్గర ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు.

తెలుగు సినీ పరిశ్రమకు ప్రపంచ ఖ్యాతీ తెచ్చిన ఎస్వీ రంగారావు అంటే తెలియని  తెలుగు వారు ఉండరు. ఆయన నటనాచాతుర్యంతో  విమర్శకుల మన్ననలు కూడా అందుకున్నారు. ఆయన తెర మీదే కనిపిస్తేనే సినిమా హిట్ అయిన సందర్భాలు అనేకం.  అంతటి మహానటుడికి ఇప్పటి వరకు  తెలుగు గడ్డ మీద విగ్రహం లేకపోవడం కచ్చితంగా లోటే. ఈలోటును పూడ్చేందుకు ఎస్వీఆర్ అభిమానులు  తాడేపల్లిలో విగ్రహం ఏర్పాటు చేశారు. ఎస్వీఆర్ విగ్రహాన్ని మెగాస్టార్ చిరంజీవి ఆవిష్కరించారు.

ఎస్వీ రంగారావును గౌరవించడమంటే మనల్నిమనం, తెలుగు సినిమాను గౌరవించుకోవడమే. జానపథ పాత్రలే కాదు, సాంఘిక సినిమాల్లోనూ  ఏ పాత్రకైనా ఒదిగిపోయేవారు ఎస్వీఆర్. ఎస్వీ రంగారావు లాంటి నటుడు తమకు లేడే అని బాధ పడిన దేశాలు కూడా ఆ రోజుల్లో ఉన్నాయంటే ఆయన ఎంతటి మహానటుడే అర్ధం చేసుకోవచ్చు.  తెలుగు సినిమా ఎదుగుతున్న రోజుల్లో తన డైలాగులు, నటనతో పరిశ్రమను నిలదొక్కుకునేలా చేసిన నటుడు ఎస్వీఆర్. ఆయన విగ్రహాన్ని నేడు తాడేపల్లిలో మెగాస్టఆర్ చిరంజీవి ఆవిష్కరించడం తెలుగువారందరికీ గర్వకారణం.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.