చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!

By Newsmeter.Network  Published on  7 Oct 2019 11:43 AM GMT
చింతమనేని ప్రభాకర్ కు మూడేళ్ల జైలు శిక్ష..ఈ సారి ఎన్నికల్లో నో ఎంట్రీ..!

పశ్చిమగోదావరి: అత్యంత వివాదాస్పద నేతగా పేరుగాంచిన చింతమనేని ప్రభాకర్ కు జిల్లా కోర్టు మూడేళ్ల పాటు జైలు శిక్ష విధించింది. గత 2014 ఎన్నికల్లో దెందులూరు నియోజకవర్గం నుంచి గెలిచిన చింతమనేని రాజ్యాంగేతర శక్తిగా ఎదిగారని ఆయన రాజకీయ ప్రత్యర్ధులు అంటుంటారు. టీడీపీ అండతో చింతమనేని ఇష్టానుసారంగా చెలరేగిపోయారని చెబుతారు. చంద్రబాబు ప్రోద్బలంతో అధికారుల మీద దాడులు చేశారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపించిన సందర్భాలున్నాయి.

ఇసుక అక్రమ రవాణా చేయడం, అడ్డొచ్చిన అధికారులు కొట్టడం, సివిల్ పోలీసులు పై దాడులు, దౌర్జన్యాలు చింతమనేని గురించి ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన చిట్టా చాంతాడంతా ఉంటుంది. ల్యాండ్ సెటిల్మెంట్లు, కొల్లేరు పరిసర ప్రాంతాల్లో దౌర్జన్యాలతో చింతమనేని చెలరేగిపోయారు. ఇటీవలనే చింతమనేనిని రిమాండ్ కు తరలించారు. రిమాండ్ కు తరలిస్తున్న సమయంలో కూడా చింతమనేని పోలీసులను దుర్భాషలాడాడు.

మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అరెస్ట్ కావడం ఇది ఐదోసారి. గతంలో కూడా పలు కేసుల్లో చింతమనేని అరెస్ట్ అయ్యారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో కూడా మహిళా ఎమ్మార్వోపై దాడి చేసిన కేసులో అప్పటి సీఎం చంద్రబాబు రాజీ చేసిన సంగతి తెలిసిందే. చింతమనేని దూకుడు ఎక్కవుని అంటారు. మాట్లాడే తీరులో కూడా తేడా ఉంటుందని చెబుతారు. చింతమనేని బూతు పురాణం అందుకుంటే ఆపలేమని టీడీపీ నేతలే అంటుంటారు. బెదిరించడం, అదిరించడం చింతమనేని నైజం అని పశ్చిమ గోదావరి జిల్లా నేతలే చెప్పుకుంటూ ఉంటారు.

Next Story