908కి చేరిన కరోనా మృతుల సంఖ్య

By రాణి  Published on  10 Feb 2020 11:02 AM GMT
908కి చేరిన కరోనా మృతుల సంఖ్య

చైనా దేశాన్ని గడగడలాడిస్తోన్న కరోనా వైరస్ మరో 97 మందిని బలి తీసుకుంది. సోమవారం నాటికి ఆ దేశ కరోనా మృతుల సంఖ్య 908కి చేరినట్లు అధికారికంగా వెల్లడించింది ఆ దేశం. ఇప్పటి వరకూ కరోనా బాధితుల సంఖ్య 40 వేలకు చేరింది. వీరందరికీ వివిధ ఆస్పత్రుల్లో ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డుల్లో చికిత్స అందజేస్తున్నారు వైద్యులు. కాగా..చికిత్స పొందుతున్న వారిలో 296 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. 3281 మంది కరోనా బాధితులు పూర్తి ఆరోగ్యంతో ఇళ్లకు చేరుకున్నారు. అలాగే కరోనా బాధితులతో కలిసి ఉన్నట్లు అనుమానిస్తూ..1.87 లక్షల మందిపై అధికారులు నిఘా పెట్టారు. ప్రపంచ దేశాల్లో భారత్ తో సహా ఇప్పటి వరకూ 300 కరోనా కేసులు నమోదయ్యాయి.

కాగా..చైనా నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఇచ్చిన సెలవులు ముగిశాయి. నిజానికి ఫిబ్రవరి 3వ తేదీ నాటికే న్యూ ఇయర్ సెలవుల గడువు ముగిసింది. కానీ..కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉండటంతో అక్కడి ప్రభుత్వం 9వ తేదీ వరకూ సెలవులను పొడిగించింది. సెలవులు ముగియడంతో ఉద్యోగస్తులు తిరిగి తమ ఊర్లకు చేరుకుంటున్నారు. బీజింగ్, హుబెయ్ వెలుపల ప్రాంతాల్లో కరోనా వైరస్ కాస్త తగ్గిందని అధికారులు వెల్లడించారు. బీజింగ్ నుంచి వచ్చిన పిలుపు మేరకు ఇంటర్నేషనల్ మిషన్ ను చైనాకు పంపనున్నట్లుగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్ వెల్లడించారు.

Next Story