ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు చుక్కెదురు!
By Newsmeter.Network
ముఖ్యాంశాలు
- భారత పౌరుడిగా కొనసాగేందుకు అనర్హుడు
- పౌరసత్వం కోసం తప్పుడు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు
- చెన్నమనేని పౌరసత్వం రద్దు చేసిన కేంద్ర హోంశాఖ
- పౌరసత్వం రద్దుపై హైకోర్ట్ కు వెళ్తానన్న చెన్నమనేని
తెలంగాణ రాష్త్రంలోని వేములవాడ టీఆర్ ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ కు పౌరసత్వం విషయంలో చుక్కెదుర్తెంది. దొంగచాటుగా పౌరసత్వం పొందారని కేంద్రం ప్రకటించింది. చెన్నమనేని రమేష్ భారత పౌరసత్వం రద్డు చేస్తున్నట్లు కేంద్ర హోంశాఖ ప్రకటించింది. దీంతో చెన్నమనేని ఎమ్మెల్యే పదవి కూడా సహజంగా పోతుంది. రాజ్యాంగం ప్రకారం భారతీయ పౌరుడు మాత్రమే పని చేయాలి. కేంద్రం నిర్ణయంతో వేములవాడకు ఉప ఎన్నిక వచ్చే అవకాశముంది. చెన్నమనేని రమేష్ కు ప్రస్తుతం జర్మని పౌరసత్వం ఉంది.
వేములవాడ శాసనసభ్యుడు చెన్నమనేని రమేష్ ద్వంద్వ పౌరసత్వం కలిగి ఉన్నాడంటూ రాజకీయ ప్రత్యర్ధి ఆది శ్రీనివాస్ 2009 నుంచి న్యాయపోరాటం చేస్తున్నారు. తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందాడని ఆది శ్రీనివాస్ చెబుతూ వచ్చాడు. తెలంగాణ హైకోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర హోం శాఖ విచారణ జరిపి, చెన్నమనేని పౌరసత్వం చెల్లదంటూ ప్రకటించింది.
తప్పుడు సమాచారంతో పౌరసత్వం పొందారు..!
భారత పౌరసత్వం కోసం చెన్నమనేని రమేష్ మార్చి31, 2008న దరఖాస్తూ చేసుకున్నారు. సెక్షన్ 5 (1) (ఎఫ్) ప్రకారం దరఖాస్తూ చేసుకోవడానికి ముందు ఏడాది ఇండియాలో నివాసం ఉండాలి. ఈ విషయంలో చెన్నమనేని తప్పుడు సమాచారం ఇచ్చినట్లు కేంద్ర హోంశాఖ నిర్ణయించింది. నవంబర్ 21, 2008న 12 నెలల్లో విదేశాలకు వెళ్లిన వివరాలను ఇవ్వాలని హోంశాఖ చెన్నమనేనిని కోరింది. తాను విదేశాలకు వెళ్లలేదని చెన్నమనేని నవంబర్ 27, 2011న చెన్నమనేని కేంద్ర హోంశాఖకు సమాధానం ఇచ్చారు. ఫిబ్రవరి 4, 2009న కేంద్ర హోంశాఖ చెన్నమనేనినికి భారత పౌరసత్వాన్ని ఇచ్చింది. దీనిపై శ్రీనివాస్ 2009లో రివిజన్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ కొనసాగించిన కేంద్ర హోంశాఖ..తప్పుడు సమాచారంతో చెన్నమనేని పౌరసత్వం పొందారని నిర్ధారించింది. దీంతో ఆయన పౌరసత్వాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.
ఆది శ్రీనివాస్ ముందస్తు పిటిషన్..!
వేములవాడ ఎమ్మెల్యే చెన్నమానేని రమేష్ పౌరసత్వం రద్దైన సంగతి తెలిసిందే. హోంశాఖ ఇచ్చిన తీర్పు తో హైకోర్టు కెవియట్ పిటిషన్ దాఖలు చేశారు కాంగ్రెస్ నేత అది శ్రీనివాస్. మళ్ళీ ఎమ్మెల్యే చెన్నమనేని హైకోర్టు ను ఆశ్రయిస్తే ముందస్తు సమాచారం ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. తమకు తెలియకుండా ఎలాంటి ప్రక్రియ చేపట్టారదని పిటిషన్‌లో హైకోర్ట్‌ను కోరారు ఆది శ్రీనివాస్