వైసీపీ పై ఘాటు విమర్శలు చేసిన చంద్రబాబు

By రాణి  Published on  6 Feb 2020 12:48 PM GMT
వైసీపీ పై ఘాటు విమర్శలు చేసిన చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ నుంచి కియ కార్ల తయారీ సంస్థ తమిళనాడుకు తరలిపోనుందన్న వార్తలు గురువారం ఉదయం నుంచి వైరల్ అవుతున్నాయి. జాతీయ మీడియాలో వచ్చిన కథనం కలకలం రేపింది. దీనిపై టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు స్పందించారు. వైఎస్సార్సీపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పై ఆయన విమర్శలు చేశారు. బుగ్గన అందరికీ కథలు చెప్తున్నారని విమర్శించారు. ఉద్యోగాలు, పనులు, లారీల రవాణా తమకే కావాలంటూ కియా యాజమాన్యాన్ని ప్రభుత్వం బెదిరించింది వాస్తవం కాదా అని చంద్రబాబు ప్రశ్నించారు. చెప్పేవన్నీ అబద్ధాలు కాకుండా..చెప్పిన అబద్ధాలే చెప్పకుండా చెప్తున్నారని నిప్పులు చెరిగారు. నోటికొచ్చినట్లు లెక్కలు చెప్పడం..గుడ్డిగా మాట్లాడటం వైసీపీ నేతల నైజమంటూ వ్యాఖ్యానించారు. ఈ తీరుతోనే వోక్స్ వ్యాగన్ పూణేకి వెళ్లిపోయిందన్నారు.

వైసీపీ తమవెనకున్న మందబలాన్ని చూసుకుని విర్రవీగుతుందని వివాదాస్పదంగా మాట్లాడారు. రాష్ర్టానికి వచ్చిన కంపెనీలను హోల్ సేల్ గా తరిమేస్తారా అని మండిపడ్డారు. వైసీపీకి ఏమంత గొప్పదనం ఉందని..వారిని చూసి రాష్ర్టానికి పరిశ్రమలు రావడానికి ? అని ప్రశ్నించారు. వైసీపీ ప్రభుత్వంపై జాతీయ, అంతర్జాతీయ మీడియా దుమ్మెత్తి పోస్తోందని, వైసీపీ బుద్ధిమాంద్యం చర్యలతో రాష్ర్టానికున్న బ్రాండ్ పేరు పోతోందన్నారు. ఏపీకి వైసీపీ సైతాన్ పట్టుకుందని, సైతాన్ ను చూసి రాష్ర్టంలో పెట్టుబడులు పెట్టేందుకు ఎవరూ రారని చంద్రబాబు ఘాటు విమర్శలు చేశారు.

Next Story