డీసీపీ మహేందర్‌ తలకు బలమైన గాయం.. పరిస్థితి విషమం

హైదరాబాద్‌ సీసీఎస్‌ అడిషనల్‌ డీసీపీ మహేందర్‌ తలకు బలమైన గాయం అయ్యింది. మహేందర్‌ను సీసీఏస్‌ అధికారులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. కాగా డీసీపీ మహేందర్‌ గత కొంత కాలంగా బ్రెయిన్‌లో బబుల్స్‌ సమస్యతో బాధపడుతున్నారు. సోమవారం ఉదయం ఆఫీస్‌కి వచ్చిన తర్వాత బబుల్స్‌ పగిలిపోవడంతో ఆయన బాత్రూమ్‌లో కుప్పకూలి పడిపోయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆయన పరిస్థితివిషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. వైద్యులు డీసీపీ మహేందర్‌కు చికిత్స అందిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్