పవన్‌ కల్యాణ్‌ స్థాపించిన జనసేన పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. ఈ రాజీనామా లేఖను పవన్‌ కల్యాణ్‌కు పంపినట్లు లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. పార్టీని నడిపించే పవన్‌ కల్యాణ్‌ తిరిగి సినిమాల్లో నటించడం పట్ల ఆయన అభ్యంతరం వ్యక్తం చేశారు. సినిమాల్లో నటించను.. జీవితమంతా ప్రజాసేవకే అంకితం చేస్తానన్న పవన్ కల్యాణ్.. తిరిగి సినిమాల వైపు వెళ్లడంపై ఆయన తప్పుబాట్టారు.

పవన్ కల్యాణ్‌కు విధివిధానాలు లేవని తెలుస్తోందని లక్ష్మీనారాయణ  రాజీనామా లేఖలో విమర్శించారు. అందుకు జనసేన నుంచి తప్పుకొంటున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులు నా వెంట ఉండి నడిచిన కార్యకర్తలకు కృతజ్ఞతలు చెబుతున్నానని అన్నారు.

Janasena

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.