సముద్రంలో కుప్పకూలిన కెనడా నేవీ హెలికాప్టర్‌

By సుభాష్  Published on  2 May 2020 8:41 AM GMT
సముద్రంలో కుప్పకూలిన కెనడా నేవీ హెలికాప్టర్‌

ఒక వైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా మహమ్మారి భయపెడుతుంటే.. మరో వైపు కొన్ని కొన్ని ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కెనడా మిలటరీకి చెందిన ఓ చాపర్‌ సముద్రంలో కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరో ఐదుగురు గల్లంతయ్యారు. కాగా, గ్రీస్‌, ఇటలీ దేశాలు చెందిన అంతర్జాతీయ సరిహద్దు వద్ద పెట్రోలలింగ్‌ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

నాటో నేవల్‌ టాస్క్‌ఫోర్స్‌ రాయల్‌ కెనడా నేవి హెలికాప్టర్‌ గ్రీస్లోని లోనియన్‌ సముద్ర తీరంలో కూలిపోయిందని కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రుడీ తెలిపారు. ఈ హెలికాప్టర్‌లో రాయల్‌ కెడియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన నలుగురు సభ్యులతో పాటు మరో ఇద్దరు ఉద్యోగులు ఉన్నారని పేర్కొన్నారు. చాపర్‌ కూలిపోవడంపై గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

Next Story