నల్లమల్లలో కార్చిచ్చు..

నల్లమల్లలో అడవిలో కార్చిచ్చు రేగింది. దీంతో అడవి తగలబడుతోంది. నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట పరిసర ప్రాంతంలో 60 హెక్టార్లలో మంటలు ఎగిసిపడుతున్నాయి. పచ్చిని చెట్టు అగ్నికి ఆహుతవుతున్నాయి. దోమలపెంట-వటవర్లపల్లి మార్గంలో శ్రీశైలం వెళ్లే మార్గంలో మంటలు చెలరేగడంతో శ్రీశైలం వెళ్లే భక్తులు ఇబ్బందులు పడుతున్నారు.

స్థానికులు స్పందించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న అటవీ శాఖ అధికారులు మంటలను ఆర్పడానికి ప్రయత్నిస్తున్నారు. మంటలు ఎలా చెలరేగాయన్నదానిపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఎవరన్నా కావాలని అంటించారా? లేక ఎండలకు ఇలా జరిగిందా అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్