ఉగ్రవాదుల బీభత్సం.. 24 మంది మృతి

By సుభాష్  Published on  17 Feb 2020 1:10 PM GMT
ఉగ్రవాదుల బీభత్సం.. 24 మంది మృతి

ఆఫ్రికాలోని బుర్కినాఫాసో దేశంలో ఉగ్రవాదులు బీభత్సం సృష్టించారు. చర్చిపై దాడికి తెగబడ్డారు. ఉగ్రవాదులు చేసిన దాడిలో చర్చి పాస్టర్‌తోపాటు 24 మంది మృతి చెందాడు. మరో 20 మందికి తీవ్ర గాయాలు అయ్యారు. మరి కొందరిని కూడా ఉగ్రవాదులు కిడ్నాప్‌ చేసినట్లు తెలుస్తోంది. చర్చిపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారని స్థానికలు చెబుతున్నారు.

జిహాదీ ఉగ్రవాదులు క్రిస్టియన్లను టార్గెట్‌ చేసుకుని దాడికి తెగబడినట్లు తెలుస్తోంది. ఘటన స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చర్చి వద్ద భద్రతా కట్టుదిట్టం చేశారు.

Next Story