తిరుమలలో ఓ రౌడీ షీటర్‌ దారుణ హత్యకు గురయ్యాడు. లీలామహల్‌ దగ్గర బెల్టు మురళీ అనే రౌడీషీటర్‌ను దుండగులు అతికిరాతకంగా హత్య చేశారు. ఈ హత్యలో మొత్తం 8 మంది దుండగులు పాల్గొన్నట్లు స్థానికులు గుర్తించారు. అందరూ చూస్తుండగానే ప్రత్యర్థులు రౌడీషీటర్‌ను దారుణంగా నరికి చంపడంతో స్థానికులు భయాందోళనతో పరుగులు తీశారు. కాగా, హత్యకు గురైన వ్యక్తిపై తిరుమల పోలీసుస్టేషన్‌లో ఎన్నో కేసులున్నట్లు తెలుస్తోంది. ఒక హత్య  కేసులో ప్రధాన నిందితుడని సమాచారం. సమాచారం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. దుండగులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

సుభాష్ గౌడ్

నేను న్యూస్ మీటర్‌లో జర్నలిస్టుగా పని చేస్తున్నాను. గతంలో రిపోర్టర్‌గా, కంటెంట్ రైటర్‌, సబ్ ఎడిటర్‌గా భారత్‌ టుడే న్యూస్‌ ఛానల్‌, సూర్య, ఆంధ్రప్రభ, న్యూస్‌హబ్‌, ఏపీ హెరాల్డ్‌లలో పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో నేను ఈ మార్గాన్ని ఎంచుకున్నాను.