బ్రిట‌న్‌ ప్రిన్స్ చార్లెస్‌కు క‌రోనా

By సుభాష్  Published on  25 March 2020 11:31 AM GMT
బ్రిట‌న్‌ ప్రిన్స్  చార్లెస్‌కు క‌రోనా

కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తోంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు ఎలాంటి వారినైనా వదిలిపెట్టడం లేదు. తాజాగా బ్రిటన్ ప్రిన్స్ చార్లెస్ (71) కరోనా పాజిటివ్ వచ్చింది. ఆయన ఆరోగ్యం బాగానే ఉన్నట్లు అధికార ప్రతినిధి తెలిపారు. ఆయన భార్య కామిల్లా (72)కు కూడా కరోనా పరీక్షలు నిర్వహించగా, ఆమె రిపోర్టు నెగిటివ్ వచ్చినట్లు తెలిపారు.

కాగా, వీరిద్దరూ బాల్ మోరల్ లో సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొన్ని రోజులుగా ప్రిన్స్ చార్లెస్ ఇంటి వద్దే ఉన్నారని అధికార వర్గాలు తెలిపాయి. వైద్యుల సూచనల మేరకు ప్రిన్స్ చార్లెస్ ఐసోలేషన్లో ఉన్నారు.

అయితే ఎవరి ద్వారా ప్రిన్స్ చార్లెస్ కు కరోనా వైరస్ సోకిందనే విషయం తెలియలేదు. ఈ మధ్య కాలంలో ప్రిన్స్ చార్లెస్ కొన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నారని అధికారిక ప్రకటనలో తెలిపారు.

కాగా, కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి వరకు మృతుల సంఖ్య 19వేలకు చేరుకుంది. ఇక చికిత్స పొందుతున్న వారి సంఖ్య 4 లక్షలకుపైగానే ఉంది. కరోనా వైరస్ వల్ల ప్రపంచ వ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతోంది. కరోనా మృతుల్లో ఇటలీ మొదటి స్థానంలో ఉండగా, చైనా రెండో స్థానంలో ఉంది.

Next Story