బాలీవుడ్ మూవీ తీస్తున్న డైరెక్టర్‌ తేజ. హీరో ఎవ‌రో తెలుసా..?

By Newsmeter.Network  Published on  28 Nov 2019 6:05 AM GMT
బాలీవుడ్ మూవీ తీస్తున్న డైరెక్టర్‌ తేజ. హీరో ఎవ‌రో తెలుసా..?

డైరెక్టర్‌ తేజ 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో మంచి స‌క్స‌స్ అందుకున్నారు. కానీ.. ఆ త‌ర్వాత తీసిన 'సీత' సినిమాతో మ‌ళ్లీ వెన‌క‌బడ్డారు. అయితే.. ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో తెలుగులో సినిమా చేయ‌డం క‌న్నా బాలీవుడ్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. అందుకేనేమో.. హిందీ మూవీ ప్లాన్ చేస్తున్నారు. అయితే దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆర్టికల్‌ 370 నే క‌థా వ‌స్తువుగా ఎంచుకున్నట్లు సమాచారం.

ఇందుకోసం ఈ క‌థాంశంతో ఓ కథ రాశారని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ చిత్రాన్ని తెలుగు, త‌మిళ్, హిందీ భాష‌ల్లో నిర్మించాలి అనుకుంటున్నార‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం గోవాలో ఈ కథకు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్‌ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయని టాక్ వినిపిస్తోంది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఇందులో హీరో న‌టించేందుకు అమితాబ్ ని సంప్ర‌దించినట్లు తెలుస్తోంది‌. తేజ చెప్పిన క‌థ విని అమితాబ్ ఓకే చెప్పార‌ని తెలిసింది. మ‌రి..ఈ సినిమాతో తేజ మ‌ళ్లీ మ‌రో విజ‌యాన్ని సాధిస్తాడేమో చూడాలి.

Next Story
Share it