31న ఆకాశంలో మరో అద్భుతం

By సుభాష్  Published on  29 Oct 2020 9:04 AM GMT
31న ఆకాశంలో మరో అద్భుతం

ఈనెల 31వ తేదీన ఆకాశంలో మరో అద్భుతం జరగనుంది. చందమామ నిండుగా కనిపించనున్నాడు. 31న ఆకాశంలో చంద్రుడు కనువిందు చేయనున్నాడు. ప్రజలంతా బ్లూ మూన్‌ వీక్షించవచ్చు. ఇది అక్టోబర్‌ నెలలో రెండు పౌర్ణమి కావడంతో దీనిని బ్లూ మూన్‌గా పిలుస్తారు. బ్లూమూన్‌ను కొన్ని దేశాల్లో హంటర్‌ మూన్‌గా అని పిలుస్తారు. చలికాలంలో రాత్రి పూట జంతువులను వేటాడడానికి వేటగాళ్లుకు ఈ పౌర్ణమి సహకరిస్తుంది. అందుకే దీనిని హంటర్‌ మూన్‌ అని కూడా పిలుస్తుంటారు. ఈ బ్లూ మూన్‌ అనేది సాధారణంగా ప్రతీ రెండు లేదా మూడు సంవత్సరాలకోసారి మాత్రమే ఏర్పడుతుంది. గతంలో 2018లో ఈ బ్లూమూన్‌ ఏర్పడగా, ఈనెల 31న ఏర్పడనుంది. ఈ ఏడాది తర్వాత బ్లూ మూన్‌ తిరిగి 2039లో ఏర్పడనుంది.

బ్లూ మూన్‌ అంటే ఏమిటీ..?

ఈ ఏడాది తర్వాత బ్లూ మూన్‌ మళ్లీ 2039లో ఏర్పడనుంది. అందుకే ఈ సారి అందరూ చూడాల్సిందే. ఒక నె లలో రెండు పౌర్ణమిలు ఏర్పడితే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌ అంటారు. అయితే బ్లూ మూన్‌ రోజు చంద్రుడు నీలం రంగులో కనిపిస్తాడు. అగ్ని పర్వత విస్పోటనం, అడవి మంటల వల్ల చంద్రుడు కొన్ని సార్లు రంగుమారుతున్నట్లు అనిపిస్తుంది అంతే.

నాసా ఏం చెబుతోంది

అయితే నాసా మాత్రం మరోలా చెబుతోంది. ఒకే నెలలో వచ్చే రెండో పౌర్ణమిని బ్లూ మూన్‌గా అంటారు. బ్లూ మూన్‌ రోజు చంద్రుడు ఎప్పటిలాగే కనిపిస్తాడు. ఈ రోజు ప్రత్యేకంగా బ్లూ కలర్‌లో కనిపిస్తాడన్నది వాస్తవం కాదు. ఐతే ఆకాశంలో ఉండే దుమ్మూ, పొగ వల్ల రంగు వేరేలా కనిపించే అవకాశం ఉందని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అక్టోబర్‌ 31న కనిపించే బ్లూ మూన్‌ 76 ఏళ్ల తర్వాత అన్ని జోన్లలో కనిపిస్తుందని కొన్ని వార్తలు ప్రచురితం కాగా, 76 ఏళ్ల తర్వాత హోల్లోవీన్‌ రోజున బ్లూ మూన్‌ కనిపిస్తుందన్నట్లు కొన్ని కథనాలు వెలువడ్డాయి.

Next Story