‘సమయాన్ని,ప్రజధనాన్ని వృధా చేస్తూ మొన్న G.N రావు కమిటీ,నిన్న బోస్టన్ కమిటీ, రేపు హైపవర్ కమిటీ..
పేరు ఏదయినా సీఎం మనసులో ఉన్న ఆలోచననే నివేదికగా ఇచ్చి ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా రాష్ట్రాన్ని ప్రజలను తీవ్ర గందరగోళానికి గురి చేస్తున్నారు.’ అని చేతిలో రాయి పట్టుకుని ఉన్న ఫొటోని జతచేస్తూ.. బీజేపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ కు నెటిజన్లు తమదైన శైలిలో రిప్లైలు ఇచ్చారు.

”అవును ఇప్పుడు AP రాజధాని మీద రక రకాల opinions తో బీజేపీ వాళ్ళు వాళ్ళ పళ్ళు ఊడగొట్టు కోవాల్సిందే. అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు.” మరొక నెటిజన్..”అయ్యా కన్నా రాజధాని అమరావతిలో ఉండాలని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో మౌన దీక్ష చేశాక కూడా రాజధాని అంశం రాష్ట్రం పరిదిలోది అని GVL,కిషన్ రెడ్డి చెప్పారు…
బిజెపిలో మీ బతుకు ఎంటో ఇక్కడే తెలిసిపోతోంది.
మీరు చంద్రబాబు & రామోజీ డైరెక్షన్లో నడుస్తున్నాయి మీ పార్టీకి కూడా తెలుసు.” అని బదులిచ్చారు. ఇక్కడ సోది రాయకుండా ముందు మోడీని కలవండి అని ఇంకొకరు సలహా ఇచ్చారు.
”తొందరపడి పగలకొట్టుకోకండి.. ఈ వయసులో మళ్ళీ ఏం తినలేరు” అని మరో నెటిజన్ సెటైర్ వేశారు. ఏదేమైనా ఈ ట్వీట్ తో కన్నా లక్ష్మీనారాయణను నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.