బిగ్‌బాస్‌ - 4 ఎప్పుడంటే..!

By సుభాష్  Published on  23 Aug 2020 9:42 AM GMT
బిగ్‌బాస్‌ - 4 ఎప్పుడంటే..!

బిగ్‌బాస్‌ తెలుగు రియాలిటీ షో.. ఇది తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. స్టార్‌ మాలో ప్రసారం అయ్యే ఈ షోకు ఎంతో ఆదరణ ఉంది. ఇప్పటి వరకు కొనసాగిన మూడు సీజన్లు కూడా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. ఇప్పుడు అందరి దృష్టి బిగ్‌బాస్‌ -4పై ఉంది. ఎప్పుడెప్పుడు ప్రారంభం అవుతుందా..? అని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నిర్వాహకులు ప్రోమోను సైతం విడుదల చేశారు. నాలుగో సీజన్‌కు మరోసారి మన్మథుడు నాగార్జున హోస్ట్‌గా చేయనున్నట్లు కూడా ప్రకటించారు. అయితే నాగార్జున ఈ సారి భిన్నంగా మూడు గెటప్ప్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకోనున్నారు.

ఇక షో ప్రారంభం కాకముందే టాలీవుడ్‌ వర్గాల్లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ఈ షోకు సంబంధించి నిర్వాహకులు ఇప్పటికే కంటెస్టెంట్‌లను ఫైనల్‌ చేశారని. ఇక బిగ్‌బాస్‌ నిర్వాహకులు మొత్తం 16 మందిని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరందరికి కరోనా పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌లో ఉంచారట. 14 రోజుల క్వారంటైన్ తర్వాత మళ్లీ పరీక్షలు చేసి ఆ తర్వాత హౌస్‌లోకి పంపించనున్నారని తెలుస్తోంది. ఇక ఈ షో ఆగస్ట్‌ 30వ తేదీ నుంచి ప్రారంభం కావచ్చని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే నిర్వాహకులు అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. అంతేకాదు వికీపీడియాలో సైతం ఆగస్టు 30న ప్రారంభం అవుతుందని, మొత్తం 15 మంది పాల్గొంటారని, 105 రోజులు షో ఉండబోతుందని చెప్పుకొచ్చారు.

కాగా, నాలుగో సీజన్‌లో జబర్దస్త్‌ కెవ్వు కార్తీక్‌, ముక్కు అవినాష్‌ సింగర్‌ నోయల్‌సేన్‌, యాంకర్లు, అరియానా, నటీనటులు కరాటే కళ్యాణి, సురేఖావాణి, పునమ్‌ కౌర్‌, తరుణ్‌, శ్రద్దాదాస్‌ పూజిత పొన్నాడ, యూ ట్యూబ్ స్టార్లు అలేఖ్య హారిక, మహబూబ్‌ దిల్‌సే, గంగవ్వ, కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌, జోర్దార్‌ సుజాతలు కంటెస్టెంట్లుగా ఉండబోతున్నారని సమాచారం.

కంటెస్టెంట్‌ పేర్లలో మార్పులు..

కాగా, నాలుగో సీజన్‌లో కంటెస్టెంట్లు మార్పు చేర్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొరియోగ్రాఫరర్‌ రఘు-ప్రణవి జంటను కూడా తీసుకురానున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. కానీ వీరికి చిన్న పాప ఉండటంతో వచ్చే అవకాశాలు తక్కువే అని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే మరో సీరియల్‌ నటుడిని, ఓ యాంకర్‌ను కూడా తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఆ యాంకర్‌ దేవీ నాగవల్లి అని కూడా ప్రచారం జరుగుతోంది. కాగా, ఈ లిస్ట్‌లో వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి చివరిలో మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది.

Next Story