బిగ్ బాస్ 3: పునర్నవి అవుట్..!

By Newsmeter.Network  Published on  9 Oct 2019 3:56 PM GMT
బిగ్ బాస్ 3: పునర్నవి అవుట్..!

బిగ్ బాస్ హౌస్‌ నుంచి పదకొండో వారంలో పునర్నవి ఎలిమినేట్ అయింది. సోషల్ మీడియా లీకులు ఈసారి కూడా నిజమయ్యాయి. ఈవారం రాహుల్‌, వరుణ్‌, పునర్నవి, మహేష్‌లు నామినేట్‌ కాగా.. తొలుత డబుల్‌ ఎలిమినేషన్‌ ఉంటుందని ప్రచారం జరిగింది. మహేశ్‌ విట్టాతో పాటు మరొకరు కూడా హౌజ్‌లో నుంచి వెళ్లిపోతున్నట్టు లీక్‌లు వచ్చాయి. అయితే, అలా జరగలేదు. పునర్నవి మాత్రమే ఎలిమినేట్‌ అయింది. ఇక పునర్నవి ఎలిమినేట్‌ కావడంతో రాహుల్‌ వెక్కివెక్కి ఏడ్చాడు.

హౌస్ నుంచి బిగ్‌బాస్ స్టేజిపైకి వెళ్లిన పునర్నవి.. రాహుల్ వెళ్లిపోతున్నానని అనగానే.. రాహుల్ దు:ఖాన్ని ఆపుకోలేకపోయాడు. ఆమె కోసం వెక్కి వెక్కి ఏడ్చాడు. దాంతో మిగతా హౌస్ మేట్స్ అతడిని ఓదార్చారు.

పునర్నవికి చివరిసారి టాస్క్ ఇచ్చారు నాగార్జున. ఇంటిలో ఉన్న వారిలో ఎవరికి హగ్ ఇస్తావు? ఎవరికి పంచ్ ఇస్తావు.? అని ప్రశ్నించారు. అందులో మహేష్, బాబా భాస్కర్‌కు పంచ్ ఇచ్చిన పునర్నవి... వితిక, వరుణ్, అలీకి మాత్రం హగ్ ఇచ్చింది. ఇక రాహుల్ 'నా వేస్ట్ ఫెల్లో' అంటూ బిగ్‌హగ్ ఇచ్చింది. టాస్క్‌లపై దృష్టి పెట్టాలని.. ఓవర్ ఎక్సైట్ కావొద్దని రాహుల్‌కు సూచించింది. కోతి వేషాలు వేయకుండా జాగ్రత్తగా ఆడమని.. ఏమైనా అవసరముంటే వరుణ్, వితికతో చర్చించాలని సలహాలు ఇచ్చింది పునర్నవి. ఇక ఇంట్లో బాబా భాస్కర్ బానిసగా ఉండాలని, అలీ రెజా మాస్టర్‌గా ఉండాలని బిగ్ బాంబ్ వేసింది.

Next Story