న్యూఢిల్లి : ఎయిర్ టెల్ నెట్ వర్క్ వినియోగదారులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. న్యూ ఢిల్లీ పరిధిలో ఎయిర్ టెల్ వైఫై కాలింగ్ ను ప్రారంభించినట్లు భారతీ ఎయిర్ టెల్ వెల్లడించింది. ఇకపై ఎయిర్ టెల్ కస్టమర్లు వాయిస్ కాల్స్ మాదిరిగానే వైఫై ద్వారా కూడా కాల్స్ చేసుకునే సదుపాయం కల్పించినట్లు తెలిపారు సంస్థ ప్రతినిధులు. ఇతర నెట్ వర్క్ లకు సాధారణ ఫోన్ కాల్స్ లాగే 2జి, 3జి, 4జి, వీవోఎల్టీఈ, వైఫై కు కూడా కాల్స్ చేసుకోవచ్చని వివరించారు. అలాగే ఎయిర్ టెల్ రోమింగ్ సమయంలో కూడా కస్టమర్లు వైఫై కాల్స్ చేయవచ్చు కానీ అంతర్జాతీయ కాలింగ్ కు మాత్రం అనుమతి లేదని స్పష్టం చేశారు. వైఫై కాలింగ్ కు కొత్త సిమ్ అవసరం ఉండదని, ఇది రోమింగ్ సమయంలో కూడా పనిచేస్తుందన్నారు. త్వరలోనే ఈ సదుపాయాన్ని అన్ని బ్రాడ్ బ్యాండ్ నెట్ వర్క్ లు, హాట్ స్పాట్ లకు కూడా కల్పిస్తామన్నారు.

జియో వచ్చినప్పటి నుంచి ఇతర నెట్ వర్క్ ల వినియోగం తగ్గిపోయింది. అప్పట్లో జియో తక్కువ ధరలకే 4జి నెట్, అన్ లిమిటెడ్ ప్యాకేజీలతో రావడంతో ఎయిర్ టెల్ వినియోగదారులు దాదాపు తగ్గిపోయారు. ఆ దెబ్బకి ఇతర నెట్ వర్క్ లు ఇంకా కోలుకోలేదు. దాదాపు రెండేళ్ల తర్వాత జియో రీఛార్జ్ ధరలను పెంచడంతో ఇప్పుడిప్పుడే ఎయిర్ టెల్ వినియోగదారులు పెరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఎయిర్ టెల్ సంస్థ వైఫై కాలింగ్ ఆప్షన్ ను ప్రారంభించింది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.