ఓవైపు అక్క మరణం.. మరోవైపు వరల్డ్‌కప్‌ టైటిల్.. కన్నీళ్లు దిగమింగుతూనే..

By Newsmeter.Network  Published on  11 Feb 2020 7:37 AM GMT
ఓవైపు అక్క మరణం.. మరోవైపు వరల్డ్‌కప్‌ టైటిల్.. కన్నీళ్లు దిగమింగుతూనే..

బంగ్లాదేశ్‌కు అండర్‌-19 వరల్డ్ కప్‌ అందించి ఓవర్‌ నైట్ స్టార్‌ అయ్యాడు అక్బర్‌ అలీ. ఏ ఫార్మాట్‌లోనైనా బంగ్లాకు ఇదే తొలి ఐసీసీ టైటిల్. ఆదివారం భారత్‌తో జరిగిన ఫైనల్‌లో ఆరు వికెట్లు పడిన దశలోనూ ఏ మాత్రం ఒత్తిడికి లోనుకాకుండా.. అజేయంగా 43 పరుగులు చేసి జట్టును విజేతగా నిలిపాడు. కాగా.. అతని కష్టం వెనుక విషాదం దాగి ఉంది.

నలుగురు తోబుట్టువుల్లో అక్బ‌రే చిన్న‌వాడు. అతనికి అక్క ఖ‌దీజా ఖాతూన్‌తో అంటే ఎంతో ఇష్టం. ప్రతి విషయంలోనూ అతనికి అండగా నిలిచేది. జనవరి 22న కవల పిల్లలకు జన్మనిచ్చి మరణించింది. అయితే వరల్డ్‌కప్‌ ఆడుతున్న అక్బర్‌ అలీకి ఈ విషయాన్ని కుటుంబ సభ్యులు ఎవ్వరూ చెప్పలేదు. కానీ రెండు రోజుల తరువాత పాకిస్థాన్‌తో లీగ్ మ్యాచ్ వ‌ర్షం కార‌ణంగా ర‌ద్ద‌యిన.. అనంత‌రం అక్బ‌ర్ ఇంటికి కాల్ చేయ‌గా ఈ విష‌యం వెలుగు చూసింది. త‌న‌కు ఈ విష‌యం ఎందుకు చెప్ప‌లేద‌ని తీవ్రంగా క‌ల‌త చెందాడు.

అయిన‌ప్ప‌టికీ, బాధ‌ను దిగ‌మింగుకుని జ‌ట్టును ఫైన‌ల్ వ‌ర‌కు చేర్చాడు. పైనల్‌ లో అజేయ కెప్టెన్‌ ఇన్నింగ్స్‌లో టీమ్‌కి విజయాన్ని అందించాడు. ఇక అక్బ‌ర్ స్టోరీని తెలుసుకున్న అంద‌రూ.. త‌న అసామాన్య పోరాటం అంద‌రిలోనూ స్ఫూర్తి నింపుతుంద‌ని పేర్కొంటున్నారు.

Next Story