తండ్రి కాదు.. వాడు కామాంధుడు.. కన్నకూతురినే..!

By Newsmeter.Network  Published on  30 Nov 2019 10:03 AM GMT
తండ్రి కాదు.. వాడు కామాంధుడు.. కన్నకూతురినే..!

కర్నూలుజిల్లా: బనగానపల్లిలో మండలంలో దారుణం చోటుచేసుకుంది. రాత్రి కన్నకూతురిపై తండ్రే అత్యాచారానికి పాల్పడ్డాడు. నందివర్గం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని గ్రామంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే మైనర్‌ అయిన తన కూతురిపై తండ్రే ఈ అఘాయిత్యానికి పాల్పడుతుండటంతో.. బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు బాలికను పాణ్యం పరిధిలోని ఆస్పత్రికి తరలించారు.

అయితే ఈ నెలలో మొత్తం రెండు సార్లు బాలికపై ఆత్యాచారానికి పాల్పడినట్లు బంధువులు చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని తీసుకున్నారు. అనంతరం పోలీసులు విచారణ చేపట్టారు. ఇదిలా ఉంటే... కన్నకూతురిపై.. తండ్రే ఇంత దారుణానికి ఒడిగట్టడంతో స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Next Story
Share it