ఒలింపిక్స్ కు క్వాలిఫై అవ్వాలంటే సైనా, శ్రీకాంత్ ఆడాల్సిందే

By రాణి  Published on  6 March 2020 11:04 AM GMT
ఒలింపిక్స్ కు క్వాలిఫై అవ్వాలంటే సైనా, శ్రీకాంత్ ఆడాల్సిందే

సైనా ప్రస్తుతం ప్రపంచ ర్యాకింగ్స్ లో 22వ స్థానంలో ఉండగా, శ్రీకాంత్ 21 వ స్థానంలో నిలిచాడు. ఈ టోర్నమెంట్ లో వారు మంచి ప్రదర్శన ఇస్తే టాప్-16 లో స్థానం సంపాదించే అవకాశం ఉంది. దీంతో టోక్యో ఒలింపిక్స్ లో ఆడడానికి అర్హత సాధించడం చాలా సులువు.

ఆటగాళ్లు ఎవరూ ఇన్ఫెక్షన్ కలగాలని కోరుకోరని.. ఇంగ్లాండ్ కు వెళ్ళినప్పుడు అక్కడ ఏమి జరుగుతుందో అసలు ఊహించలేమని పారుపల్లి కశ్యప్ అన్నాడు. ముఖ్యంగా యూరప్ లో టోర్నమెంట్ లకు హాజరయ్యే సమయాల్లో ఆటగాళ్లకు సాధారణంగా జలుబు-దగ్గు వస్తుంటాయని.. భారత్ కు తిరిగి వచ్చే సమయంలో ఎయిర్ పోర్టుల్లో చెకింగ్ చేస్తున్నప్పుడు జలుబు దగ్గు ఉన్నాయని ఐసొలేషన్ వార్డుల్లో రెండు వారాల పాటూ ఉంచితే కష్టం కదా అని కశ్యప్ చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా స్విస్ ఓపెన్(మార్చి 17- మార్చి 22) వరకూ జరగాల్సి ఉండగా ఆ టోర్నమెంట్ పై అసలు క్లారిటీ లేదని అన్నాడు. రానున్న రోజుల్లో మలేషియా ఓపెన్, సింగపూర్ ఓపెన్, ఇండియా ఓపెన్ టోర్నీలు జరగాల్సి ఉందని ఇవి నిర్వహిస్తారో లేదో కూడా తమకు ఖచ్చితమైన సమాచారం లేదని కశ్యప్ అన్నాడు. ఇలాంటి సమయంలో ఎలా టోర్నమెంట్ లకు సమాయత్తమవ్వాలో తెలియని పరిస్థితి తమదని కశ్యప్ చెప్పుకొచ్చాడు.

చిరాగ్ శెట్టి ఆల్ ఇంగ్లాండ్ టోర్నమెంట్ లో పాల్గొనాలని అనుకుంటున్నా..రంకిరెడ్డి సిద్ధంగా లేరు. ప్రస్తుతం ఈ డబుల్స్ ప్లేయర్స్ ఎనిమిదో ర్యాకింగ్స్ లో ఉండడంతో ఒలింపిక్స్ కు ఈజీగా క్వాలిఫై అయ్యే అవకాశాలు ఉన్నాయి. తమ తల్లిదండ్రులు చాలా భయపడుతూ ఉన్నారని..రిస్క్ తీసుకోకండని చెప్పారని..తాము 90 శాతం ఒలింపిక్స్ కు క్వాలిఫై అయినట్లేనని రంకిరెడ్డి చెప్పుకొచ్చారు. తమ కోచ్ కూడా మా నిర్ణయానికే ఓటు వేశారన్నారు రంకిరెడ్డి. ముఖ్యంగా ప్రయాణించడం పట్ల తాము ఎక్కువగా భయపడుతూ ఉన్నామని.. తాము చిన్నవయసులోనే ఉన్నామని కరోనా 50 ఏళ్ల పైబడిన వారిపై ఎక్కువ ప్రభావం చూపిస్తుందని.. తాము ఇతరదేశాలకు వెళ్లొచ్చి.. తమ తల్లిదండ్రులకు, బంధువులకు వైరస్ లక్షణాలను అంటిస్తే వారు ఇబ్బంది పడతారని రంకిరెడ్డి అన్నారు.

గోపీచంద్ తల్లికి అకాడమీ బాధ్యతలు

ఆటగాళ్లు తాము అకాడమీని ఖాళీ చేసి వెళుతున్నామని గోపీచంద్ తల్లి సుబ్బరావమ్మకు తెలిపారు. ప్రస్తుతం అకాడమీ బాధ్యతలు ఆమెనే చూసుకుంటూ ఉన్నారు. అకాడమీకి కేవలం రెండు కిలోమీటర్ల దూరంలోనే కరోనా వైరస్ బాధితులు ఉన్నారని వార్తలు రాగానే తామంతా భయపడ్డామని సాత్విక్ చెప్పుకొచ్చాడు. ఐటీ ఆఫీసుల్లో ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వడం, కొన్ని ఆఫీసులు ఖాళీ అవ్వడం లాంటి వార్తలు తాము విన్నామన్నాడు. చాలా రోడ్లు ఖాళీ అయ్యాయని సాత్విక్ చెప్పుకొచ్చాడు.

అకాడమీలోని జూనియర్ ఆటగాళ్లు వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోతున్నారు. మధ్య ప్రదేశ్, ఛత్తీస్ ఘర్, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన ఆటగాళ్లు ఇప్పటికే బయలుదేరిపోయారు. గోపీచంద్ వాళ్ళమ్మగారు కూడా కొద్దిరోజులు ఆటగాళ్లను ఊరికి వెళ్ళిపోమన్నారు. పరిస్థితిలో మార్పులు రాగానే తిరిగి రావాలని ఆమె సూచించారు. రంకిరెడ్డి తన సొంత ఊరు అమలాపురంకు వెళ్లిపోనున్నారు. శెట్టి ముంబైకి వెళ్లనున్నారు. హైదరాబాద్ లో పరిస్థితిలో మార్పు రాకపోతే రంకిరెడ్డి ముంబైకు వెళ్లి తన పార్ట్నర్ తో ప్రాక్టీస్ చేయనున్నారు.

ప్రణోయ్ మాట్లాడుతూ తనకు ఆరు నెలల క్రితం డెంగ్యూ వచ్చిందని.. తనలో ఇంకా రోగనిరోధక శక్తి అన్నది ఇంకా అంతగా పెరగలేదని చెప్పుకొచ్చాడు. ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్ కు దగ్గరగా ఉన్నవాళ్లు రిస్క్ తీసుకోకతప్పదని అన్నాడు.

బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పై కశ్యప్ ఆగ్రహం

క్వాలిఫికేషన్ పీరియడ్ ను బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ పెంచకపోవడాన్ని తీవ్రంగా తప్పుపట్టాడు కశ్యప్. ఒలింపిక్స్ కు ముందు ఒకే ఒక్క టాప్ ఈవెంట్ పెట్టడం వలన సైనా, శ్రీకాంత్ లాంటి ఆటగాళ్లు చాలా నష్టపోతారని అన్నాడు.

Next Story