హైదరాబాద్ : హెచ్ సీఏ అధ్యక్షుడు మహ్మద్ అజహరుద్దీన్ తన కుమారుని వివాహానికి తెలంగాణ సీఎం కేసీఆర్ ను ఆహ్వానించారు. అజహరుద్దీన్ కుమారుడికి ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జా సోదరి ఆనమ్ మీర్జాతో ఈనెల 12వ తేదీన వివాహం జరగనుంది. ఈ వేడుకకు హాజరు కావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ను మంగళవారం అజహరుద్దీన్, సానియామీర్జా ప్రగతి భవన్ లో కలిసి ఆహ్వానించారు. వివాహ శుభలేఖను కేసీఆర్ కు అందజేశారు.

ఇదిలావుంటే.. టీమిండియా కు సుదీర్ఘ కాలం పాటు సేవ‌లందించిన అజారుద్దీన్.. ఫిక్సింగ్ ఆరోప‌ణ‌ల‌తో జ‌ట్టుకు దూర‌మ‌య్యాడు. అనంత‌రం అజ‌ర్ రాజ‌కీయ రంగప్ర‌వేశం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి బ‌రిలో నిలిచి మొరాదాబాద్ ఎంపీగా కూడా గెలిచారు. త‌ద‌నంత‌ర పరిణామాల నేఫ‌థ్యంలో కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్‌లో చేరారు. అజ‌ర్ ప్ర‌స్తుతం హెఎచ్‌సీఎ అధ్య‌క్షులుగా ఉన్నారు.

ఇక భార‌త అగ్ర‌శ్రేణి టెన్నిస్ క్రీడాకారిని సానియామీర్జా విష‌యానికి వ‌స్తే.. పాక్ క్రికెట‌ర్ షోయ‌బ్ మాలిక్‌ను వివాహ‌మాడిన విష‌యం తెలిసిందే. ఈ జంటకు కొద్ది రోజుల క్రిత‌మే ఓ మ‌గ‌బిడ్డ పుట్టాడు. దీంతో సానియా గ‌త కొంత‌కాలంగా టెన్నిస్‌కు దూరంగా ఉంది.

 

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.