ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిందే..

By Newsmeter.Network  Published on  30 Jan 2020 3:27 PM GMT
ఇద్ద‌రి మ‌ధ్య న‌లిగిందే..

ఖిలాడి అక్షయ్‌ కుమార్‌, సౌత్‌ ఇండియన్‌ స్టార్‌ ధనుష్‌, స్టార్‌ కిడ్‌ సారా అలీఖాన్‌లు ప్రధాన పాత్రల్లో బాలీవుడ్‌లో ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రముఖ దర్శకుడు ఆనంద్‌ ఎల్‌ రాయ్‌ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రానికి ‘ఆత్రంగి రే’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

2020 మార్చిలో చిత్రీకరణను ప్రారంభించి 2021 ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. వాస్తవానికి ఈ సినిమాలో ధనుష్ - సారా అలీఖాన్ జంటగా నటిస్తున్నారు. అయితే ఆ ఇద్దరి మధ్యలో అక్షయ్ ఎందుకు? అన్నదే అసలు సస్పెన్స్. కిలాడీని ఇందులో పూర్తి స్థాయి పాత్రలో చూపిస్తున్నారా? లేక అతిధిగా మాత్రమే పరిమితం చేశారా? అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఇక రాంజానా స్టార్ గా ధనుష్ కి బాలీవుడ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. అయితే మధ్యలో తమిళ సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు బాలీవుడ్ ని టచ్ చేస్తున్నాడు. 2013లో తనని హిందీ చిత్ర సీమకు పరిచయం చేసిన ఆనంద్.ఎల్.రాయ్ దర్శకత్వం లోనే ధనుష్ మరోసారి తాజా చిత్రానికి అంగీకరించారు.

Atrangi Re movie

కొత్త సినిమాకు సంబంధించిన ఫొటోలను హీరోయిన్‌ సారా అలీఖాన్‌ సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. ‘ఆనంద్‌ ఎల్‌ రాయ్‌తో కలిసి పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆత్రంగీ రే. నా అదృష్టాన్ని నమ్మలేకున్నా’ అనే క్యాప్షన్‌తో అక్కీ, ధనుష్‌లతో కలిసి ఉన్న ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు. ఇంకా అమ్మ‌డు ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ గా మారాయి. ఇద్ద‌రి మ‌ధ్య పాప న‌లిగిపోయిందే.. అంటూ అభిమానులు కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు.

ఏదో ఒక లాజిక్కు.. జిమ్మిక్కు లేకుండా నిండా పాతికైనా నిండని అమ్మాయితో ఇలా 50 ప్లస్ హీరో.. ఫిఫ్టీకి దగ్గరవుతున్న హీరో ఇంత ఘాటైన రొమాన్స్ చేయరు కదా? మ‌రి అదేదో చూడాలంటే సినిమా విడుద‌ల వ‌ర‌కు ఆగ‌క త‌ప్ప‌దు.

Next Story