దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి... కారణం ఇదేనా..!

By Newsmeter.Network  Published on  6 Dec 2019 12:24 PM GMT
దీర్ఘకాలిక సెలవులో అశ్వత్థామరెడ్డి... కారణం ఇదేనా..!

తెలంగాణ ఆర్టీసీ సమ్మెలో కీలకంగా వ్యవహరించిన జేఏసీ కన్వీనర్‌ అశ్వత్థామరెడ్డి దీర్ఘకాలిక సెలవులో వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన గురువారం ఉదయం ఎంజీబీ బస్టాండులో విధుల్లో చేరి, ఆ వెంటనే 6 నెలల కాలానికి సెలవుకోసం దరఖాస్తు చేశారని తెలుస్తోంది. జేఏసీలో కీలకంగా వ్యవహరించిన రాజిరెడ్డి, థామస్‌రెడ్డి, సుధలు ఇప్పటికే విధుల్లో చేరిపోయారు. కాగా, ఆర్టీసీ పోస్టుకు రాజీనామా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్టు సన్నిహితులు ద్వారా తెలుస్తోంది. ‘రెండేళ్ల వరకు గుర్తింపు సంఘం ఎన్నికలొద్దంటూ కార్మికులతో అధికారులు బలవంతంగా సంతకాలు తీసుకుంటున్నారని, ఇది చట్ట విరుద్ధం... దీనిపై కార్మికశాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేస్తామని, అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తామని, అందుకు ధర్నాలు కూడా నిర్వహిస్తామని అశ్వత్థామరెడ్డి చెబుతున్నారు. అలాగే సమ్మెకాలంలో కొందరి కార్మికుల నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. అశ్వత్థామరెడ్డే కార్మికులను రెచ్చగొట్టి సమ్మెను విరమించకుండా చేశాడనే వార్తలు వచ్చాయి. ఏకంగా ఓ డ్రైవరే ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు కూడా. అశ్వత్థామరెడ్డి కారణంగానే మా జీవితాలు పోతున్నాయని, అందిరిక బెదిరిస్తూ సమ్మెలోకి లాగుతున్నాడని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తూ, విధుల్లో చేరాడు.

Next Story
Share it