కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 9 మంది మృతి..!

By సుభాష్  Published on  22 July 2020 2:03 AM GMT
కూలిన ఆర్మీ హెలికాప్టర్‌.. 9 మంది మృతి..!

కొలంబియాలో ఆర్మీ హెలికాప్టర్‌ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 11 మంది జవాన్లు కనిపించకుండా పోవడంతో ఆర్మీ అధికారులు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టగా, అందులో 9 మంది సైనికులు మృతదేహాలను లభ్యమైనట్లు ఆర్మీ తెలిపింది. మరో ఇద్దరి ఆచూకీ కోసం గాలింపు గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇక ఈ ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కావడంతో వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

దేశ ఆగ్నేయ ప్రాంతంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న గెరిల్లాలను అణచడానికి చేపట్టిన ఆపరేషన్‌లో భాగంగా 17 మంది సైన్యంతో హెలికాప్టర్‌ బయలుదేరినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. అయితే కొలంబియాలోని వియర్‌ రాష్ట్రంలో ఉన్న ఇనిరిడా నది సమీపంలో హెలికాప్టర్‌ శకలాలను అధికారులు గుర్తించారు. హెలికాప్టర్‌ను గెరిల్లలు కూల్చివేశారా..? లేక ప్రమాదవశాత్తు కూలిపోయిందా.. అనే విషయంపై ఆరా తీస్తున్నారు.

Next Story