అర్జున్ రెడ్డి సినిమాతో టాలీవుడ్ లో సంచ‌ల‌నం సృష్టించిన యువ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. ఈ సినిమా ఇచ్చిన విజ‌యంతో బాలీవుడ్ లో సందీప్‌ రెడ్డికి తెగ ఆఫర్లు వస్తున్నాయి. ఇదే సినిమాను అక్క‌డ క‌బీర్ సింగ్ పేరుతో రీమేక్ చేశారు. అక్క‌డ కూడా సంచ‌ల‌న విజ‌యం సాధించడం తెలిసిందే. దీంతో సందీప్ కి బాలీవుడ్ లో వ‌రుస‌గా ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయి. అందుచేత సందీప్ రెడ్డి బాలీవుడ్ లో మరో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు.

Image result for sandeep reddy vanga

గత కొంత కాలంగా ఈ విషయంపై పలు రకాల కథనాలు వస్తున్నప్పటికీ చిత్ర యూనిట్ క్లారిటీ ఇవ్వలేదు. ఫైనల్ గా ఇటీవల కబీర్ సింగ్ నిర్మాతలు భూషణ్ కుమార్ – మూరధ్ ఖేతని సందీప్ వంగని కలుసుకోవడంతో క్లారిటీ వచ్చింది. ఇక ప్రాజెక్ట్ విషయానికి వస్తే.. క్రైమ్ డ్రామా తరహాలో సందీప్ తన తదుపరి ప్రాజెక్ట్ ని డెవలప్ చేసుకున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ కి ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదు.

Image result for sandeep reddy vanga

టైటిల్ తో పాటు సినిమాలో నటీనటుల వివరాలను త్వరలో తెలియజేయనున్నారు. ఇక కబీర్ సింగ్ సినిమా బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద టాప్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇప్పటి వరకు 2019లో రూ. 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకున్న టాప్ మూవీగా ‘కబీర్ సింగ్’ సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. మ‌రి… ఈ సినిమాతో ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడో చూడాలి.

Image result for sandeep reddy vanga

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.