అమరావతి: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గా జస్టిస్ జితేంద్ర కుమార్ మహేశ్వరి ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలో ని తుమ్మల పల్లి కళాక్షేత్రం లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జె.కె మహేశ్వరి చేత గవర్నర్ బిశ్వభూషన్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.

Img 20191007 Wa0004

Img 20191007 Wa0000

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎల్.వి. సుబ్రహ్మణ్యం, పలువురు హైకోర్టు న్యాయమూర్తులు, న్యాయవాదులు, పలువురు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

Img 20191007 Wa0005

Img 20191007 Wa0011

విభజన తరువాత ఏపీ హైకోర్ట్ ఏర్పడినప్పటి నుంచి శాశ్వత ప్రధాన న్యాయమూర్తి లేరు. గత గురువారం కేంద్ర న్యాయ శాఖ జేకే మహేశ్వరిని ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తిగా నియమించింది.

ప్రమాణస్వీకారం అనంతరం మహిషాసురమర్దిని అలంకారంలో ఉన్న కనకదుర్గమ్మను దర్శించుకున్నారు ఏపీ ప్రధాన న్యాయమూర్తి మహేశ్వరి. చీఫ్ జస్టిస్ గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అమ్మవారి ఆశీస్సులు తీసుకున్నారు. ప్రమాణస్వీకారం తరువాత అమ్మవారి దర్శనానికి వచ్చిన ఏపీ హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తికి ఆలమ మర్యాదలతో అర్చకులు స్వాగతం పలికారు. అమ్మవారి కి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం విశేష వస్త్రాలు తో సిజె ను సత్కరించారు అర్చకులు, ఈఓ సురేష్ బాబు.

Newsmeter.Network

Next Story