ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు మొదలైన ఏపీ కేబినెట్ భేటీ సుమారు రెండున్నర గంటల పాటు కొనసాగింది. మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో సచివాలయం నుంచి మంత్రులు బయటికొచ్చారు..కానీ ఏ ఒక్క మంత్రి మీడియాతో మాట్లాడేందుకు సహకరించలేదు.  కాగా..అమరావతిలో భూ దందాపై కేబినెట్ భేటీలో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే ఇన్ సైడర్ ట్రేడింగ్ పై సీబీఐ విచారణ చేయించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. రాష్ర్టంలో పంచాయతీ రాజ్ ఎన్నికలు నిర్వహించాలని కేబినెట్ సమావేశంలో తీర్మానించారు. జీఎన్ రావు కమిటీ నివేదిక, కేబినెట్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక గురించి చర్చించిన విషయాలపై మంత్రి పేర్ని నాని వివరణ ఇవ్వనున్నారు.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.