అనుష్క పెళ్లి ఆ డైరెక్టర్ తోనేనా ?

స్టార్ హీరోయిన్ స్వీటీ అనుష్క వివాహం విషయంలో ఇప్పటికే పలుమార్లు రూమర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె వివాహం చేసుకోబోయే వరుడు అంటూ ప్రభాస్ తో సహా ఇంకో యువ హీరో పేరు కూడా ఆ మధ్య చర్చకు వచ్చింది. కానీ అవేవీ వాస్తవం కాదని త్వరగానే తేలిపోయింది. అయితే తాజాగా అనుష్క పెళ్లి విషయంలో మరొక గాసిప్ గుప్పుమంది. గతంలో పుకార్ల కంటే బలంగా ఈ రూమర్ చక్కర్లు కొడుతుండటం విశేషం.

టాలీవుడ్ సీనియర్ దర్శకుడి కుమారుడితో అనుష్క వివాహమనేది ఈ తాజా రూమర్ల సారాంశం. ఇప్పటికే ఆ దర్శకుడి కుమారుడికి ఒకసారి వివాహం అయింది. అయితే అతను కూడా డైరెక్టరే. తెలుగుతో పాటు హిందీలో కూడా ఒక సినిమా చేశారు. కొన్నాళ్ల క్రితం డైవర్స్ కూడా తీసుకున్నాడు, ఇప్పుడు అతడితోనే అనుష్క పెళ్లి అంటూ డీటైలింగ్ ఇస్తూ పేరోక్కటే చెప్పకుండా మిగతా వివరాలు మొత్తం ఇండస్ట్రీ జనం లీకులు ఇచ్చేశారు.

దీంతో రీడర్స్ అతన్ని త్వరగానే పోల్చుకున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంతుందనేది స్వీటీ లేదా సదరు సీనియర్ డైరెక్టర్ వైపు నుండి క్లారిటీ వస్తేనే తెలుస్తుంది. ఇకపోతే అనుష్క తాజా చిత్రం ‘నిశ్శబ్దం’ ఏప్రిల్ 2న విడుదలకానుంది.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.