ఖమ్మం:  రోజురోజుకు ఆర్టీసీ సమ్మె ఉధృతమవుతుంది. హైదరాబాద్ లోనే కాదు..జిల్లాల్లోనూ నిరసన సెగలు అధికార పార్టీ నేతలను తాకుతున్నాయి. ఖమ్మం మేయర్  కారును ఆర్టీసీ కార్మికులు అడ్డుకున్నారు. సీఎం కేసీఆర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.  తమ న్యాయపరమైన డిమాండ్లు నెరవేర్చాలంటూ స్గోగన్స్ ఇచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు నియంతృత్వ ధోరణిలో ఉన్నాయని ఖమ్మం ఆర్టీసీ కార్మికులు విమర్శించారు.

ఇక హైదరాబాద్ లో కూడా సమ్మె ఉధృతమవుతుంది. మూడో రోజు కూడా ఆర్టీసీ కార్మికులు రోడ్డెక్కారు. నిన్న కేసీఆర్ ప్రకటనపై కార్మికులు భగ్గుమంటున్నారు. హైదరాబాద్ లో గన్ పార్క్ దగ్గర 30 మంది ఆర్టీసీ జేఏసీ నేతలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్ధామ రెడ్డి  కూడా ఉన్నారు.

ఆర్టీసీ కార్మికులు, ప్రభుత్వం  పంతాలు, పట్టింపులు ఎలా ఉన్నా ప్రయాణికులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. పండగ సమయంలో ఊళ్లకు వెళ్లక తప్పని పరిస్థితి. వెళ్దామంటే ట్రాన్స్ పోర్ట్ లేదు. ట్రాన్స్ పోర్ట్ లేకపోయినా  ప్రైవేట్ వాహనాలు ఎక్కి వెళ్దామంటే..అధిక చార్జీల మోత. అయితే..పండుగ సమయంలో సమ్మపై మాత్రం ప్రజల నుంచి ఆర్టీసీ కార్మికులు విమర్శలు ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్